తాప్సి పన్ను ఒకప్పుడు తెలుగులో గుర్తింపు పొందిన హీరోయిన్ తెలుగులో సరైన అవకాశాలు లేక బాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది. అయితే  తాప్సీ పన్ను రీసెంట్ గా  నటించిన హిందీ సినిమా ‘థప్పడ్’. అయితే ఈ సినిమా ఇటీవల విడుదలై వివాధాల్లో కూరుకుపోయింది. ఈ సినిమాలో  తాప్సీ ఓ గ‌ృహిణి పాత్రలో కనిపించింది. సినిమాలోని ఓ సన్నివేశంలో ఇంట్లో ఒక  పార్టీ జరుగుతుండగా ఏదో వృత్తి సంబంధమైన ఒత్తిడిలో ఉన్న భర్త, భార్య తాప్సీపై చేయి చేసుకుంటాడు. అందరిలో భార్య పై చేయి చేసుకోవడంతో తాప్సి అవమానంతో ఫీల్ అయ్యి, ఒక  నిర్ణయం తీసుకుంటుంది. దీనితో  అంతవరకూ అన్యోన్యంగా ఉన్న వారి దాంపత్య జీవితం చెల్లాచెదురు అవుతుంది. చిలికి చిలికి గాలివానలా విడాకుల దాక వెళుతుంది. భర్త ఎంత ప్రాధేయపడినా వినకుండా ఆమె(తాప్సి) చివరికి విడాకులు తీసుకుంటుంది. అయితే ఈ సినిమా కధ విషయంలో పలువురు భిన్న అభిప్రాయాలు వ్యక్త పరుస్తున్నారు. 

 

IHG

 

సినిమా కథను పొగిడే వాళ్లతోపాటు, విమర్శించే వాళ్లు కూడా అలాగే ఉన్నారు. ఈ విషయం పై ‘బాగీ-3’ దర్శకుడు అహ్మద్ ఖాన్ ఓ ఇంటర్వూలో మాట్లుడుతూ ‘‘నాకు సినిమా కథ విచిత్రంగా అనిపించింది. నాకు కాన్సెప్ట్ అసలు అర్థం కాలేదు. భర్త ఏదో ఒత్తిడిలో భార్యను ఓ చెంపదెబ్బ కొడితే విడాకులు తీసుకోవాలా..? తిరిగి ఆమె ఒకటి కాదు రెండు కొట్టినా తప్పులేదు అంతే కానీ కేవలం ఒక చెంప దెబ్బతో విడాకులు తీసుకోవడమేంటి..? ఒకవేళ నేనే నా భార్యపై చేయి చేసుకుంటే నా భార్య కూడా నన్ను తన్నాలి. సమస్య అంతటితో తీరిపోతుంది. నేను చెప్పింది నా అభిప్రాయం మాత్రమే’’ అని అన్నాడు. ఎవరి అభిప్రాయం వారిది అనుకోండి... 

 

IHG

 

అహ్మద్ ఖాన్ వ్యాఖ్యలపై తాప్సీ స్పందిస్తూ ‘‘ఆయనకు నచ్చినట్లు ఆయన సినిమాలు తీస్తాడు, మేముకూడా అదే చేస్తాం. ఏది తప్పు, ఏది ఒప్పు అనేది చివరగా ప్రేక్షకులు నిర్ణయిస్తారు’’ అని రివర్స్ కౌంటర్ ఇచ్చింది. ఆడవాళ్లు ఏ విషయంలో ఎలా ఉంటారో మనకు తెలియదు. వాళ్ళకంటూ కొన్ని అభిప్రాయాలూ, విలువలు ఉంటాయి. వ్యక్తిత్వం కోల్పోయే పరిస్థితి వస్తే ఆడవాళ్లు ఎంత దూరమయిన వెళ్తారు అనేది సినిమా అర్ధం.

మరింత సమాచారం తెలుసుకోండి: