యన్టీఆర్, రామ్ చరణ్ లు తొలిసారి 'ట్రిపుల్ ఆర్'లో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. పేట్రియాట్రిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్‌లో జూ. ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా , అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దీనితో ఈ సినిమా భారీ అంచనాలతో వస్తుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమాను దాదాపు 350 కోట్ల రూపాయిల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. 

 

ఇదిలా ఉంటే కొరటాల శివ దర్శకత్వంలో,  చిరంజీవి ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం లో యన్టీఆర్, రామ్ చరణ్ లకు దర్శకుడు అఫర్‌ ఒక ఇచ్చారు. ఆ సినిమాలో ఈ ఇద్దరినీ కలిసి నటించాలని కోరారట కొరటాల శివ. అయితే  ట్రిపుల్ ఆర్' లో కలిసి నటిస్తున్న కారణంగా ఆ ఆఫర్ ను వారు వద్దన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ ఆఫర్ మరో అగ్ర హీరో మహేష్ బాబు ను వరించినట్టు టాలీవుడ్ లో చర్చ జరుగుతుంది. వెంటనే ఈ ఆఫర్ ను కొరటాల అడిగిన వెంటనే మహేష్ బాబు ఓకే చెప్పినట్టు సమాచారం. 

 

ఇప్పుడు సోషల్ మీడియా లో అంతా ఎన్టీఆర్, చరణ్ లు వదులుకున్న పాత్ర కు మహేష్ బాబు ఏ రకంగా న్యాయం చేస్తారో చూడాలి అని కామెంట్ లు చేస్తున్నారు. ప్రస్తుతం దీని గురించి టాలీవుడ్ లో కూడా పెద్ద చర్చలే జరుగుతున్నాయి. ఇక మహేష్ బాబు ఇప్పుడు వంశీ పైడపల్లి దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత పరుశురం దర్శకత్వంలో ఒక సినిమా చేసే అవకాశం ఉంది. దీనిపై స్పష్టత త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. ఏది ఎలా ఉన్నా మెగా ఆఫర్ వచ్చినా సరే హీరోలు ఎందుకు వదులుకున్నారని కొందరు ఆసక్తిగా ఆలోచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: