టాలీవుడ్ జనాలకు ఏ వార్త వచ్చినా సరే ఒక వింతే. ఏ చిన్న వార్త వచ్చినా సరే టాలీవుడ్ జనాలు చేసుకునే పండగ అంతా ఇంతా కాదు. ప్రతీ చిన్న వార్తను పెద్దగా చూస్తూ ఉంటారు. ముఖ్యంగా వ్యక్తిగత జీవితాల విషయంలో టాలీవుడ్ జనం చూపించే ఆసక్తి అంతా ఇంతా కాదు. కొంత మంది ప్రేమలో పడితే అదేదో పాపం అయినట్టు పెద్దగా ప్రచారం చేస్తూ ఎవరి హడావుడి వాళ్ళు చేస్తూ ఉంటారు. అయితే దీని వలన ఇబ్బంది పడుతున్నారా లేదా అనేది కూడా ఆలోచించే ప్రయత్నం మాత్రం చేయరు. ఇక విడాకుల విషయం కూడా దాదాపుగా అంతే. 

 

వాళ్ళ వ్యక్తిగత విషయాల్లోకి వాళ్ళ కొంపలోకి తోంగి చూస్తూ ఉంటారు. తాజాగా ఒక దర్శకుడు ఇలాగే తొంగి చూసి ఇబ్బంది పడ్డాడట. అది ఏంటీ అనేది ఒకసారి చూద్దాం. ఇటీవల ఒక స్టార్ హీరో తన భార్యతో విడిపోయే అవకాశం ఉందని మీరు కొంత కాలంగా కలిసి లేరు కదా అంటూ వాళ్ళ పర్సనల్ విషయాలను అడిగాడట ఒక జర్నలిస్ట్. అలాగే మీరు వేరు వేరు ఇళ్ళల్లో ఉంటున్నారు కదా అంటూ ఒక ఇంట్లో ఉండటం లేదు కదా అంటూ... మీరు ఒక్కరే ఉంటున్నారు అంటూ బెడ్ రూమ్ లోకి దూరే ప్రయత్నం చేసాడు. 

 

దీనితో సదరు హీరోకి ఒళ్ళు మండి పోయింది అంటున్నారు. అసలు ఇలా అడుగుతారా అంటూ ఆ హీరో ఆ జర్నలిస్ట్ ని తీవ్రంగా హెచ్చరించినట్టు సమాచారం. ఇక అసలు సినిమా వాళ్ళతో ఎప్పుడూ ఇంటర్వ్యూ లు చేయవద్దని చెప్పాడట. ఇక ఫిలిం ఛాంబర్ లో కూడా అతని మీద సదరు హీరో ఫిర్యాదు చేసి అసలు రానీయవద్దని చెప్పాడట. ఇప్పుడు టాలీవుడ్ లో దీని గురించి పెద్ద చర్చే జరుగుతుంది. ఆ హీరో గురించి గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: