స్టార్ ప్రొడ్యూసర్స్ కు చాలా కాలిక్యులేషన్స్ ఉంటాయి. సక్సెస్ రేట్, కాంబినేషన్స్, హీరోల గ్రాఫ్ చాలా బోల్డన్ని లెక్కలతో సినిమాలు తీస్తుంటారు. అయితే అల్లు అరవింద్ మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఆలోచిస్తున్నాడు. ఫ్లాపుల్లో ఉన్న హీరోలతో ప్రాజెక్టులు రెడీ చేస్తున్నాడు. మరి ఫ్లాప్ హీరోలతో పనిచెయ్యడం వెనుక ఈ మెగా ప్రొడ్యూసర్ లెక్కేంటో తెలుసా.. 

 

స్టార్ హీరోలతో బడా సినిమాలు తీసే గీతా ఆర్ట్స్ లో సినిమాలు చేయడం చిన్న హీరోలకు కొంచెం కష్టమే. ఇక ఫ్లాపుల్లో ఉన్న హీరోలు అయితే అల్లు అరవింద్ ఎక్స్ పెక్ట్ చేయరు. కానీ ఈ ప్రొడ్యూసర్ మాత్రం గీతా ఆర్ట్స్ 2లో యంగ్ స్టర్స్ కు అవకాశాలు ఇస్తున్నాడు. ఫ్లాపుల్లో ఉన్న అఖిల్, కార్తికేయ లాంటి హీరోలతోనూ సినిమాలు తీస్తున్నాడు. 

 

ఆర్ ఎక్స్ 100తో సూపర్ హిట్ కొట్టిన కార్తికేయ మళ్లీ ఆ రేంజ్ లో సత్తా చాటలేదు. పైగా ఈ మూవీ తర్వాత కార్తికేయ నటించిన హిప్పీ, గుణ 369, 90 ఎమ్.ఎల్.సినిమాలు అయితే బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా బోల్తాపడ్డాయి. ఇక నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్ గా నటిస్తే ఇదీ కలిసిరాలేదు. 

 

కార్తికేయ విలన్ గా నటించడంతో ఈ కుర్రాడి గ్రాఫ్ తగ్గుతోందనే ప్రచారం జరిగింది. అయితే కార్తికేయ స్లంపులో పడ్డాడనే టాక్ వచ్చిన టైమ్ లోనే గీతా ఆర్ట్స్ 2లో ఓ సినిమా ఆఫర్ వచ్చింది. అల్లు అరవింద్ సమర్పణలో చావు కబురు చల్లగా అనే మూవీలో నటిస్తున్నాడు. 

 

బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోలకు ఈజీగానే మార్కెట్ దొరుకుతుంది. కానీ ఒక్కసారి మార్కెట్ లోకి వచ్చాక, సక్సెస్ లేకపోతే ఎంతపెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కష్టమే. కెరీర్ కోసం పోరాడుతూనే ఉండాలి. ఇప్పుడు అక్కినేని  అఖిల్ కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే గీతా ఆర్ట్స్ లో అడుగుపెట్టాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: