మహాశివుడి పరమ భక్తుడు భక్త కన్నప్ప గురించి తెలియని వారు ఉండరు.  అడవిలో పుట్టి ఆటవిక జాతికి చెందిన కన్నప్ప తనకు తెలియకుండానే శివుడికి పరమ భక్తుడిగా మారుతాడు.  ఆయనకు నైవేద్యంగా మాంసం పెడతాడు.  శివలింగం నుంచి రక్తం కారుతుంటే.. తన్న రెండు కళ్లు పెకిలించి శివలింగానికి పెడతారు.. అప్పుడు రక్తం కారడం ఆగుతుంది.. అయితే కన్నప్ప భక్తికి పరవశించిన శివుడు ప్రత్యక్షమై భక్త కన్నప్పగా విరాజిల్లుతావని ఆశీర్వదిస్తాడు.  గతంలో ఈ మూవీ కన్నడ నటుడు రాజ్ కుమార్ నటించగా.. తర్వాత కృష్ణం రాజు భక్తకన్నప్పగా నటించి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. 

 

అయితే ఈ మూవీ  తర్వాత చాలా సార్లు సీక్వెల్ చేయాలని భావించారు.  కృష్ణం రాజు వారసుడు కావడంతో ఈ మూవీలో ప్రభాస్ నటిస్తారని భావించారు.   ప్రభాస్ ఈ సినిమా చేయడానికి ఆసక్తి చూపించలేదు. ఈ నేపథ్యంలో భక్త కన్నప్ప ప్రాజెక్ట్ మంచు విష్ణు చేతుల్లోకి వెళ్ళింది.  మూడేళ్ళ క్రితం తనికెళ్ళ భరణి మంచు విష్ణు హీరోగా తాను భక్త కన్నప్ప మూవీ తెరకెక్కించనున్నట్లు ప్రకటించాడు.  కానీ ఇప్పుడు ఈ మూవీ తనికెళ్ల భరణి డైరెక్ట్ చేసేలా లేరని వినికిడి.  సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులలో భాగంగా హాలీవుడ్ నుండి స్టోరీ బోర్డ్ ఆర్టిస్టులను రప్పించి యానిమాట్రిక్స్ చేయించాలనుకున్నాం. 

 

భక్తకన్నప్ప తక్కువ బడ్జెట్ లో తీయాలనే ప్లాన్ లో ఉన్నారట. ఇందుకోసం ముగ్గురు అగ్ర దర్శకులను సంప్రదిస్తే బడ్జెట్ లో 30 శాతం రెమ్యునరేషన్ కింద అడిగారు. అందుకే దర్శకుడ్ని కూడా హాలీవుడ్ నుండే రప్పిస్తున్నాం. హాలీవుడ్ లో స్క్రిప్ట్ పూర్తయ్యాక సాయి మాధవ్ బుర్రా తెలుగుకు తగ్గట్లుగా దానికి మార్పులు చేస్తారు అని ప్రకటించాడు.  మొత్తానికి తెలుగు నేటివిటికి దగ్గట్లు సెట్ చేసిన తర్వాత నటీనటులను తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.  మొత్తానికి భక్త కన్నప్ప చాలా కాలం తర్వాత మళ్లీ తెరకెక్కాలని చూడటం సంతోషం అని అంటున్నారు తెలుగు ప్రేక్షకులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: