పూరీ జగన్నాద్ ఒకప్పుడు స్టార్ డైరెక్టర్.. తర్వాత తీసిన సినిమాలు సరిగా ఆడక కొంచెం డీలా పడ్డాడు. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. కొత్తదనంతో, సరికొత్త కథతో తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. కొన్ని వరుస ఫ్లాపుల తర్వాత పూరి జగన్నాథ్ సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. ఒక్క పూరీకే కాదు, హీరో రామ్ కి కూడా మంచి హిట్ ఇచ్చిన సినిమా ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమా వల్ల ఇస్మార్ట్ భామలకు పెద్ద బ్రేక్ వచ్చింది. ఈ విజయం అందించిన ఉత్సాహంతో పూరి మరో కొత్త సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి ఫైటర్ అని పేరు అనుకుంటున్నారు. 

 

అయితే ఈ సారి పాన్ ఇండియా మూవీగా ఫైటర్ టైటిల్ తో షూటింగ్ ప్రారంభించారు. ఈ చిత్రంలో రౌడీ విజయ్ దేవరకొండను హీరోగా ఎంచుకుని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. విజయ్ కి యూత్ లో మంచి క్రెజ్ ఉంది. అయితే తాజాగా ముంబయిలో తాజా షెడ్యూల్ చిత్రీకరణ సాగుతోంది. కరణ్ జోహార్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న  పాన్ ఇండియా చిత్రంగా ఫైటర్ కు ఇప్పటికే క్రేజ్ వచ్చింది. పూరి - ఛార్మి బృందం కరణ్ జోహార్ ని కూడా సంప్రదించారట, తాజాగా  ఈ మూవీకి సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది.  ఫైటర్ మూవీ బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతోంది. ఇందులో ప్రపంచ ప్రఖ్యాత బాక్సింగ్ యోధుడు మైక్ టైసన్ ని నటింపజేయాలని పూరి టీమ్ సీరియస్ గా ప్రయత్నిస్తోందంట. ఈ సినిమాలో అయన నటిస్తే మంచి హైప్ వస్తుందని వారి అభిప్రాయం. 

 

దీని కోసం పూరి జగన్నాథ్ - కరణ్ జోహార్ ఇప్పటికే టైసన్ వ్యవహారాలు చూసే పీఆర్ టీమ్ ని సంప్రదించారని తెలిసింది. టైసన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టయితే ఫైటర్ చిత్రానికి క్రేజ్ అమాంతం పెరిగిపోతుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. అయితే అది అంత సులువా..? అంటే కానేకాదు... టైసన్ ఒప్పుకుంటాడా..? అన్న ప్రశ్న మొదలయింది. ఇంతకు ముందు రోబో 2.0 చిత్రం కోసం ఆర్నాల్డ్ స్క్వాజ్ నెగ్గర్ ను తీసుకురావాలని ప్రముఖ దర్శకుడు శంకర్ శతవిధాలా ప్రయత్నించాడు. మంచి పేరు ఉన్న దర్శక దిగ్గజం శంకర్  ప్రయత్నమే ఫలించలేదు. ఆర్నాల్డ్ ని ప్రచారంలో భాగంగానే వాడారు తప్ప సినిమాలో నటింపచేయలేదు.

 

 

ఆ క్రమంలోనే ప్రస్తుతం ఫైటర్ చిత్ర యూనిట్ చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయోనని సోషల్ మీడియా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.శంకర్ చేయలేని పని పూరి చేస్తారా అన్న ప్రశ్న ఇప్పుడు మొదలయింది. ఫైటర్ చిత్రం కోసం మైక్ టైసన్ తన బిజీ షెడ్యూల్స్ ని క్యాన్సిల్ చేసుకుని నటిస్తారా..లేదా అన్నది చూడాలి. పాన్ ఇండియా లెవెల్ అంటే మాటలా...? అందులోని మైక్ టైసన్..! సినిమా మీద ఆత్రుత మొదలయింది. ఇంకా ఏముంది మన నెటిజనులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరి ఈ ప్రశ్నలకు పూరి ఎలా రెస్పాన్స్ అవుతారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: