సింగర్ గా కల్పన.. ఆమె మన తెలుగులో దాదాపు నాలుగు వంద‌ల పాటలు పాడిన‌ప్ప‌టికీ.. కొన్ని సింగింగ్ కాంపిటీషన్ ప్రోగ్రామ్స్ ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు మ‌రింత‌ మరింత దగ్గరయ్యారు అన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు. అయిదేళ్ల వ‌య‌స్సులోనే పాట‌ల తోట‌లో విహ‌రించ‌డం మొద‌లుపెట్టిన త‌మిళ గాయ‌ని ఈమె. రాగాలు, తాళాలు, శృతులు, సంగ‌తులు.. అన్నింటా ఆరితేరిన అద్భుత‌మైన గాయ‌ని. చిన్నతనం నుండే డబ్బింగ్ చెప్పడం, బాలనటిగా కొన్ని సినిమాలలో నటించారు కూడా. అయితే ఇంత టాప్ సింగ‌ర్ టిఫిన్ సెంట‌ర్ పెట్ట‌డం ఏంటి.. అస‌లు క‌థ ఏంటి..? అన్న‌ది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లిపోదాం. 

 

ఈటీవీ నుంచి తెలుగు ప్రేక్షకులను మరింత అలరించే షోలలో `క్యాష్` ప్రోగ్రాం కూడా ఒకటి. సుమ వ్యాఖ్యాతగా నిర్వహించే ఈ షో కేవ‌లం టిలివిజ‌న్‌లోనే కాకుండా.. యూట్యూబ్‌లో కూడా ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. ఇక వ‌చ్చే వారం ప్ర‌సారంకాబోయే ప్రోమోను తాజాగా విడుద‌ల చేశారు. ఈ ప్రోమోలో  ప్రముఖ సింగర్స్ మనో,కల్పన కారుణ్య అలాగే మంగ్లీ లను ఈసారి స్పెషల్ గెస్టులుగా తీసుకొచ్చారు. అలా వచ్చిన ఈ సింగ‌ర్స్‌ కేవలం పాటలతోనే కాకుండా.. యాంక‌ర్ సుమ‌తో అదిరిపోయే కామెడీని పండించారు. ఇందులో భాగంగానే యాంక‌ర్ సుమ  కల్పనతో టిఫిన్ సెంటర్ పెట్టించి వంటలు చేయించింది. 

 

అలా సింగ‌ర్ క‌ల్ప‌న క్యాష్ షోలో టిఫిన్ సెంట‌ర్ పెట్టి.. ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్వించింద‌న్న‌మాట‌. అంతేకాకుండా, ఈ ప్రోమోలో సుమ మనోతో పండించిన కామెడీ అంతా ఇంతా కాదు. రెండు చేతుల్లో రెండు రాళ్లు పట్టుకొని రాళ్ళని కరిగించే శక్తి సంగీతానికి ఉంది అంటారు.. మ‌రి మీ సంగీతంతో ఈ రాళ్లను కరిగించండి అంటూ ఛాలెంజ్ విసురుతుంది సుమ‌. ఆ తర్వాత నుంచి మనో ఎనర్జీ లెవెల్స్ పీక్స్ లోకి వెళ్లిపోయాయి. ఇక‌ వ‌చ్చే వారం క్యాష్ షోలో కామెడీ ఓ రేంజ్‌లో ఉంటుంద‌ని ప్రోమో చూస్తేనే అర్థం అవుతుంది. కాబ‌ట్టి రాబోయే క్యాష్ షోను మాత్రం మిస్ కాకండి.
  

మరింత సమాచారం తెలుసుకోండి: