సూపర్ స్టార్ మహేష్ బాబు కొద్దిరోజుల సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందు వచ్చిన విషయం తెలిసిందే. మహేష్ ప్రక్కన రష్మిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని మహేష్, దిల్ రాజు, అనిల్ సుంకర కలిసి నిర్మించారు. మంచి కమర్షియల్ ఎంటెర్టైనర్ గా దర్శకుడు అనిల్ ఆ సినిమాని తెరకెక్కించడం జరిగింది. చాలా రోజుల తరువాత మహేష్ బాబు ఫుల్ లెంగ్త్ ఎంటెర్టైనింగ్ రోల్ ని ఈ సినిమాలో పోషించడం జరిగింది. అయితే ఆ సినిమా సక్సెస్ తరువాత దర్శకుడు అనిల్ ఎవరితో సినిమా చేస్తారు అనే విషయమై కొద్దిరోజులుగా టాలీవుడ్ లో పలు వార్తలు ప్రచారం అవుతుండగా, 

 

నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి వినిపిస్తున్న వార్తలను బట్టి చూస్తే, అతి త్వరలో అనిల్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో ఒక సినిమా చేయనున్నట్లు చెప్తున్నారు. ప్రస్తుతం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న రామ్ చరణ్, దాని తరువాత జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే దాని అనంతరం అనిల్ తో రామ్ చరణ్ సినిమా ఉండే అవకాశం చాలావరకు ఉన్నట్లు చెప్తున్నారు. వాస్తవానికి సరిలేరు సినిమా షూటింగ్ సమయంలోనే మంచి ఎంటర్టైన్మెంట్ తో కూడిన ఒక పవర్ఫుల్ స్టోరీ ని అనిల్ రాసుకున్నారని, ఆ కథ చరణ్ కు అయితే బాగుంటుందని భావించిన అనిల్ కు అప్పటి నుండి ఇప్పటివరకు చరణ్ కు కథ చెప్పే అవకాశం దొరకలేదని, 

 

అయితే మూడు రోజుల క్రితం చరణ్ ఇంటికి వెళ్లిన అనిల్, ఆయనకు కథ వినిపించడం, అది చరణ్ కు ఎంతో బాగా నచ్చడం జరిగిందట. ఆర్ఆర్ఆర్ తరువాత గౌతమ్ సినిమా చేస్తున్నానని, దాని అనంతరం మీ సినిమా చేస్తానని చరణ్ చెప్పారట. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదుగాని, ఒకవేళ నిజమే కనుక అయితే, ఇప్పటికే సూపర్ స్టార్ తో పని చేసిన అనిల్ కు, ఈసారి మెగాపవర్ స్టార్ తో పని చేసే ఛాన్స్ అద్భుతమైన దక్కినట్లే మరి.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: