అల్లరి సినిమాతో అల్లరి చిల్లరిగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకొచ్చాడు ప్రముఖ దర్శకుడి కొడుకు నరేష్. మొదటి సినిమా అల్లరి చివరికి సర్ నేం అయిపోయింది. అంతగా ఆ సినిమాతో ఆకట్టుకున్నాడు నరేష్. ఆ తర్వాత వరుసగా హీరోగా చేస్తూ కామెడి సినిమాలకి కేరాఫ్ అడ్రస్ అల్లరి నరేష్ అన్న పేరుని సంపాదించుకున్నాడు. అంతేకాదు ఈ జనరేషన్ రాజేంద్ర ప్రసాద్ అన్న టాయ్గ్ ని ఫ్యాన్స్ తగిలించేలా తన సినిమాలతో పాపులర్ అయ్యాడు. అయితే గత కొంతకాలంగా నరేష్ కి ఫ్లాప్స్ కుప్పలు గా వచ్చి పడ్డాయి. దాంతో ఈయనగారి యాటిట్యూడ్ గా మారడంతో ఎవరూ హీరోగా నరేష్ ని పెటి సినిమాలు నిర్మించడానికి ముందుకు రాలేదు. 

 

అయితే గమ్యం, శంభో శివ శంభో వంటి సినిమాలలో చేసిన పాత్రలు నరేష్ కి మంచి పెరుని తెచ్చి పెట్టాయి. ఆ ఇమేజ్ తోనే 'మహర్షి' సినిమా లో ఫ్రెండ్ రోల్ చేస్తే అల్లరి నరేష్ చక్కటి గుర్తింపు తెచ్చింది. వరుస ఫ్లాప్స్ తో ఇక అయిపోయింది నరేష్ పని అనుకున్న సమయంలో మహర్షి సక్సెస్ మళ్ళీ నరేష్ కి ఊపిరి పోసింది. కామెడీ మాత్రమే కాదు.. తనలో ఎమోషనల్ పెర్ఫామర్ ఉన్నాడని ప్రూవైంది. మహర్షి తర్వాత సెలక్టివ్ గా క్యారెక్టర్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా అల్లరి నరేష్ ఓ కొరియన్ మూవీ రీమేక్ లో నటించనున్నాడని లేటెస్ట్ అప్‌డేట్.

 

సురేష్ ప్రొడక్షన్స్ లో డి.సురేష్ బాబు రీమేక్ సినిమాలతో హిట్లు అందుకుంటున్నారు. ఇదే నేపథ్యంలో గత ఏడాది వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'ఓ బేబి' రీమేక్ గా నిర్మించారు. రీసెంట్‌గా కొరియన్ మూవీ "డాన్సింగ్ క్వీన్" రీమేక్  రైట్స్ దక్కించుకుని స్క్రిప్టును రెడీ చేస్తున్నారు. ఈ సినిమాలో నరేష్ హీరోగా నటిస్తాడట. హీరోయిన్ కాజల్ అగర్వాల్ ని సురేష్ బాబు సెలెక్ట్ చేశారని తాజా సమాచారం. నరేష్ సరసన ఆ పాత్ర కి కాజల్ అగర్వాల్ అయితేనే పర్ పెక్ట్ గా సూటవుతుందని ఇలా ప్రపోజల్ పెట్టారట. అందుకు కాజల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. కాజల్ కోలీవుడ్ ఇండియన్-2 సినిమా ఒక్కటే చేస్తోంది. అయితే మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేసిన నువ్వు అల్లరి నరేష్ తో చేస్తావా ..అని అడిగితే కాజల్ జీవితం తలకిందులైనప్పుడు తప్పదు కదా అన్నదట. 

మరింత సమాచారం తెలుసుకోండి: