టాలీవుడ్ నేటి సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ దంపతుల ముద్దుల తనయ సితార పాప మన తెలుగు ప్రేక్షకులలో చాలా మందికి సుపరిచితం. అచ్చంగా చూడడానికి ముమ్మూర్తులా మహేష్ తల్లి ఇందిరా దేవిని పోలి ఉండే సితార అంటే మహేష్ కు వల్లమాలిన ప్రేమ. చిన్నవయసులోనే డాన్స్ వంటి పలు ఇతర కళలలో ఎంతో ప్రావిణ్యం సంపాదిస్తూ, తన ముద్దులొలికే మాటలు, చూడచక్కని రూపంతో అందరినీ ఎంతో ఆకట్టుకునే సితారకు ప్రత్యేకంగా కొందరు అభిమానులు ఉన్నారనే చెప్పాలి. 

 

ఇక ఈ వయసులోనే తన స్నేహితురాలు ఆద్యతో కలిసి యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసి, మంచి టాలెంట్ తో దూసుకెళ్తున్న సితార, మధ్యలో తన తండ్రి నటించిన అక్కడక్కడా కొన్ని సినిమాల్లోని సీన్స్, సాంగ్స్ కు తనదైన శైలిలో డైలాగ్స్ చెప్పడం, డ్యాన్స్ చేయడం వంటివి చేస్తుంటుంది. ఇక ఆమె వీడియోలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేస్తూ ఎంతో మురిసిపోతుంటారు నమ్రత. చిన్నప్పటినుండి ఎంతో చక్కటి రూపం కలిగిన సితార, మధ్యలో తండ్రి మహేష్ నటించిన అక్కడక్కడా కొన్ని సినిమాల వేడుకలకు హాజరై ఎంతో సందడి చేసింది కూడా. 

 

అయితే ఆయా వేడుకల సమయాల్లో, ముందుగా స్పైడర్ సినిమా సమయంలో రకుల్ ప్రీత్ తో, అలానే బ్రహ్మోత్సవం సమయంలో సమంతతో, అలానే ఇటీవల వచ్చిన భరత్ అనే నేను సమయంలో కియారా అద్వానీతో కలిసి ఫోటోలు దిగింది సితార. ఇక నేడు ఆ ఫోటోలను కొందరు సూపర్ స్టార్ ఫ్యాన్స్ తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసి వైరల్ చేస్తున్నారు. ఆ ఫోటోలను చూస్తుంటే, బాబోయ్ చిన్నవయసులోనే తన క్యూట్ నెస్ తో అందగత్తెలైన స్టార్ హీరోయిన్లనే సితార తలదన్నిందిగా అంటూ కొందరు అభిమానులు ఆమెపై సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఆ ఫోటోలు పలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్నాయి......!!   

మరింత సమాచారం తెలుసుకోండి: