సినిమా అంటే నటించడం మాత్రమే కాదు జీవించడం అని నిరూపించారు రాజ బాబు రమా ప్రభా... టాలీవుడ్ లో వాళ్లకు అంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు ఇద్దరూ. వీళ్ళు ఇద్దరూ కలిసి దాదాపు 30 సినిమాల్లో నటించారు. ఈ 30 సినిమాల్లో వీరి జోడి ని చూసి ప్రేక్షకులు ఊగిపోయారు. వీరి జోడి తెర మీద కనపడితే చాలు ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు కేరింతలు కొట్టారు. వీరి ప్రేమ వ్యవహారం సినిమాల్లో సూపర్ హిట్ అయ్యేది. రమా ప్రభ మీద రాజబాబు ఎన్నో జోకులు పెలేవి. 

 

రమా ప్రభను రాజబాబు ప్రేమిస్తున్నాను అని చెప్పడం దాన్ని రమా ప్రభా తిరస్కరించడం ఆ మధ్యలో జరిగే కామెడీ అన్నీ కూడా సినిమాల్లో కొత్త వినాదాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసాయి. అప్పటి వరకు ఒక లెక్క అప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టు ఉండేది వీరి నటన. ముఖ్యంగా రమా ప్రభ కనపడితే రాజబాబు హావ భావాలు ఒక సంచలనం. ఆ తర్వాత వీరిద్దరూ వివాహం చేసుకుంటారని అనుకున్నారు. కాని వాళ్ళు మంచి స్నేహితులు గానే మిగిలిపోయారు. ఆ తర్వాత రమా ప్రభా శరత్ బాబుని వివాహం చేసుకున్నారు. 

 

రాజ బాబు చాలా ఆస్తిని కోల్పోయి కెరీర్ చివరిలో బాగా ఇబ్బంది పడ్డారు. ఆయన దాన ధర్మాలు చేయడంతో ఉన్న ఆస్తి మొత్తం పోయింది అని చెప్తూ ఉంటారు. ఇక వీరి జోడి అప్పట్లో ఎన్నో అవార్డులు గెలుచుకుంది. సినిమాలో వీరి కోసం దర్శక రచయితలు రాసే మాటలు అన్నీ కూడా ప్రేక్షకులను బాగా మెప్పించాయి అనే చెప్పవచ్చు. కొన్ని సినిమాల్లో వీళ్ళు చేసిన సీరియస్ పాత్రలకు కూడా మంచి గుర్తింపు వచ్చింది అప్పట్లో. అలా తెలుగు వెండి తెర మీద తమదైన ముద్ర వేసుకున్నారు ఈ ఇద్దరు. మళ్ళీ అలాంటి జంట టాలీవుడ్ లో కనపడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: