పవర్ స్టార్ పవన్ కళ్యాన్ సిఎం అవుతున్నాడా.. అదెలా సాధ్యం అనుకోవచ్చు. కేవలం సిని హీరోగా ఉంటే ఇంత డౌట్ వచ్చేది కాదు కాని ఇప్పుడు పవన్ రాజకీయాల్లో కూడా ఉన్నాడు కాబట్టి సిఎం అనగానే అందరు షాక్ అవుతున్నారు. ఏపి ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటున్న పవన్ కళ్యాన్ ఈమధ్యనే మళ్ళీ సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం పింక్ రీమేక్ గా ఓ సినిమా వస్తుంది. వకీల్ సాబ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా మే 15న రిలీజ్ ప్లాన్ చేశారు. ఇక ఈ సినిమా తర్వాత క్రిష్ డైరక్ష లో సినిమా కూడా లైన్ లో పెట్టాడు పవన్. ఆ సినిమాను నవంబర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

 

ఇదిలాఉంటే ఈ రెండు సినిమాల తర్వాత పవన్ హరీష్ శంకర్ డైరక్షన్ లో సినిమా కూడా చేస్తాడని ఫైనల్ అయ్యింది. మైత్రి మూవీ మేకర్స్ ఆ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత పవన్ మరోసారి డేరింగ్ అండ్ డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ డైరక్షన్ లో మూవీ చేస్తాడని తెలుస్తుంది. బద్రి, కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలు చేసిన పూరి, పవన్ ఈసారి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో ఓ సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాన్ సిఎం అవుతాడని టాక్. పూరి జగన్నాథ్ సినిమాలో పవన్ సిఎంగా కనిపిస్తాడట.

 

పూరి డైరక్షన్ లో వచ్చిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాతోనే తనలో ఉన్న రాజకీయ కోణాన్ని బయటపెట్టిన పవన్ ఈసారి సిఎంగా కనిపించి అలరించానునాడు. ఇస్మార్ట్ శంకర్ తో ఫాం లోకి వచ్చిన పూరి ప్రస్తుతం విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నాడు. ఫైటర్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తాడని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: