ఒకప్పటి స్టార్‌ హీరోయిన్లు ఇప్పుడు అమ్మ పాత్రలకు సై అంటున్నారు ఇండస్ట్రీకి దూరం కాలేక, అలా అని హీరోయిన్‌ రోల్స్‌ లో కొనసాగలేక తప్పని పరిస్థితుల్లో అమ్మ, అత్తా పాత్రలకు ఓకె చెపుతున్నారు. అయితే ఆ రోల్స్‌ లోనూ తమ గ్లామర్‌ ఇమేజ్‌ ఏ మాత్రం పాడవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ జనరేషన్‌ లో అలా అమ్మ పాత్రకు గ్లామర్‌ యాడ్ చేసిన అందాల భామలు చాలా మందే ఉన్నారు. అయితే వీరిలో ఫస్ట్ క్లిక్‌ అయ్యింది మాత్రం నదియానే.

 

తమిళంలో టాప్ హీరోయిన్‌ గా పేరుగాంచిన నదియా.. తన తొలి సినిమాతోనే ఫిల్మ్‌ఫేర్ అవార్డును సాదించింది. మలయాళ, తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి టాప్‌ హీరోయిన్‌ గా వెలుగొందింది. ఆ రెండు ఇండస్ట్రీలలో దాదాపు అందరు స్టార్స్ సరసన నటించి మెప్పించింది. 1994 లో సినిమాలకు దూరమైన నదియా 2004లో తిరిగి సిల్వర్‌ స్క్రీన్‌ రీ ఎంట్రీ ఇచ్చింది. తల్లి క్యారెక్టర్స్, అత్త క్యారెక్టర్స్‌ చేస్తూ ఆడియన్స్‌ ను అలరిస్తోంది. రీ ఎంట్రీలో పవన్‌ కళ్యాణ్‌ కు అత్తా నటించిన అత్తారింటికి దారేది, పోలీస్‌ అధికారిగా నటించిన దృశ్యం సినిమాలు ఆమెకు మంచి పేరుతో పాటు అవార్డులు కూడా తెచ్చిపెట్టాయి.

 

ఇక ఈమె కెరీర్‌ లో మరో బెస్ట్‌ మూవీ అ ఆ. ఈ సినిమాలో నరేష్‌, నదియాల జోడి సూపర్బ్ అనే చెప్పాలి. రూడ్‌ గా మాట్లాడే తల్లి పాత్రలో నదియా, ఆమె ముందు ఏమీ మాట్లాడలేక తడబడే పాత్రలో నరేష్‌ సూపర్‌ గా ఎంటర్‌ టైన్ చేశారు. ప్రస్తుతం ఉన్న హీరోకైనా హీరోయిన్ కైనా తల్లి పాత్ర అంటే నదియానే ఫస్ట్ చాయిస్‌ గా కనిపిస్తోంది. అందుకే తల్లి పాత్రలో నటించాలంటే భారీ రెమ్యూనరేషన్‌ డిమాండ్ చేస్తోంది నదియా.

మరింత సమాచారం తెలుసుకోండి: