లారెన్స్ కు తెలుగులో చాలా మంచి పేరు ఉంది. ఒక‌ దర్శకుడిగా.. డ్యాన్స్ డైరెక్టర్ గా అంతేకాకుండా సేవా కార్యక్రమాల్ని నిర్వహించటంలో లారెన్స్ ముందు ఉంటార‌నే మంచి పేరు ఆయ‌న‌కు ఉంది. అయితే ఇప్పుడు లారెన్స్ కు షాక్ తగిలేలా తన తమ్ముడు ఒక వెధ‌వ ప‌ని చేసినట్లు ఒక మహిళ ఆరోపిస్తోంది. జూనియర్ ఆర్టిస్ట్ గా పని చేస్తున్న ఓ 29 ఏళ్ల ఒక అమ్మాయి తనని మోసగించినట్లు చెపుతోంది.. తాజాగా ఒక ప్రముఖ ఛానల్ లో ఆమె చెప్పిన మాటలు వింటే అంద‌రూ షాక్అ వాల్సిందే. అదేమిటంటే...ప్రేమ పేరుతో ఎల్విన్ తనను వేధింపులకు గురి చేశాడ‌ని.. దానికి సంబంధించిన కంప్లైంట్ పోలీసులకు ఇచ్చాన‌ని అయితే వారు మాత్రం గ‌త‌ ఆరేళ్లుగా తనను వేధిస్తున్నట్లుగా సంచలన ఆరోపణలు చేశారు. . ఆరేళ్ల క్రితం మారేడ్ పల్లి ఇన్ స్పెక్టర్ గా పని చేసి ప్రస్తుతం ఏసీపీగా వ్యవహరిస్తున్న రవీందర్ రెడ్డితో కలిసి ఎల్విన్ తనను దారుణమైన వేధింపులకు గురి చేసినట్లు ఆమె పేర్కొంటుంది. 

 

 అంతేకాకుండా ఆమెని కక్ష సాధింపు చర్యల్లో భాగంగా బ్రోతల్ కేసులో ఇరికించి 21 రోజులు జైల్లో ఉంచారని ఆమె ఆవేద‌న వెల్ల‌డించింది. ఆ మహిళ ఇంటర్వ్యూలో ఏం చెప్పిందంటే.. మాది వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం రాంపూర్. తల్లిదండ్రులు లేకపోవడంతో పెద్దమ్మ దగ్గర పెరిగాన‌ని. బాల్యంలో నేర్చుకున్న నృత్యం కరాటేతో సినిమా ఛాన్సులు వచ్చాయ‌ని ఆమె తెలిపింది. దీంతో పలు సినిమాల్లో చిన్న పాత్రలు చేశాన‌ని. కొన్ని ప్రకటనలకు మోడల్‌గా కూడా పనిచేశాన‌ని స‌ద‌రు మ‌హిళ తెలిపింది. ఓ సినిమా షూటింగ్ సమయంలోనే ఎల్విన్ పరిచయమయ్యాడ‌ని అన్నారు.

 

అక్క‌డి నుంచి ప్రేమిస్తున్నా అంటూ ప్రపోజ్ చేయ‌డంతో. ఈ మ‌హిళ‌ నో చెప్పటంతో కక్ష కట్టాడ‌ని ఆమె పేర్కొంటుంది. తాను తలచుకుంటే పెద్ద పెద్ద హీరోయిన్లే తన ముందు వాలిపోతారని.. అలాంటిది నువ్వో లెక్క? అంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో.. అప్పటి మారేడ్పల్లి ఇన్స్‌పెక్టర్ రవీందర్‌రెడ్డికి ఫిర్యాదు చేశా. దాంతో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తర్వాత ఆమెకు రవీందర్ రెడ్డి నుంచి వేధింపులు మొదలయ్యాయి. విచారణ పేరుతో  ఆమెను కాటేజీలు లాడ్జిలకు పిలిపించుకునేవాడట‌. నీచంగా మాట్లాడేవార‌ట‌. తప్పనిపరిస్థితుల్లో మకాం మార్చి రహస్యంగా తలదాచుకున్న‌ప్ప‌టికీ అక్క‌డా ఆమెను బ్ర‌త‌క‌నివ్వ‌లేదంటుంది. బ్రోతల్ కేసు పెట్టారు. 

 

ఈ విధంగా స‌ద‌రు మ‌హిళ‌ను ఇబ్బందుల‌కు గురి చేశార‌ని ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. మ‌రి దీని పై ఎల్విన్‌గాని, లారెన్స్‌గాని ఎలాంటి స్పంద‌న ఇప్ప‌టివ‌ర‌కు రాలేదు. దీంతో కొంత మంది ఫ్యాన్స్ అన్న స‌మాజ‌సేవ తమ్ముడు ఇలాంటి ప‌నులా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. స‌ద‌రు మ‌హిళ‌ తిండికి ఇబ్బంది పడుతూ.. మిత్రుల సాయంతో కాలం వెళ్లదీస్తున్నానంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తన విషయాన్ని సీఎం కేసీఆర్ పరిశీలించాలని ఆమె కోరుతున్నారు. అంతేకాక త‌న‌ను ఇంత‌లా వేధిస్తున్న వారి పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలంటూ ఆమె విన్న‌వించుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: