టాలీవుడ్ తెర మీద అగ్ర హాస్య నటుడు బ్రహ్మానందం నటిస్తున్నారు అంటే ఆ సినిమాలో కామెడికి కొరత ఉండదు. ఆయన కనపడితే చాలు ఆ సీన్ కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. వందల సినిమాల్లో ఆయన తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఆయన చేసే కొన్ని పాత్రలు ప్రేక్షకులకు అలా గుర్తుండిపోతాయి. ముఖ్యంగా భర్త పాత్రలో బ్రహ్మీ నటిస్తుంటే ఆ పాత్రకు ఒక రేంజ్ ఉంటుంది. కామెడి, రౌద్రం, భావోద్వేగం ఇలా అన్నీ పండిస్తారు బ్రహ్మానందం. ఇక ఆయన పక్కన నటించిన వారిలో ప్రత్యేకంగా చెప్పుకునేది పాత్రం కోవై సరళ గురించి. 

 

తిరుమల తిరుపతి వెంకటేశ, క్షేమంగా వెళ్లి లాభంగా రండి... అమ్మాయి కోసం ఇలా చెప్పుకుంటూ పోతే వీరి కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా వీరి మధ్య ఉండే కామెడి ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించింది. పదుల సంఖ్యలో సినిమాల్లో కలిసి నటించారు ఈ ఇద్దరు. అయితే ఇద్దరూ ఇప్పుడు అవకాశాలు లేక సినిమాలకు దూరంగా ఉన్నా సరే వీరి కాంబినేషన్ ఇప్పటికీ టీవీ లో కనపడినా సరే ప్రేక్షకుల చేత నవ్వులు పూయిస్తుంది. భార్యను హింసించే భర్తగా బ్రహ్మానందం ఎంతో ఆకట్టుకున్నారు. 

 

కోవై సరళ అయితే బ్రహ్మీ పక్కన జీవించారు. బ్రహ్మీ కి పోటీగా ఆమె నటించే వారు. వీరి పాత్రల కోసం ప్రత్యేక సీన్స్ రాసుకుని దర్శకులు... ఆ సీన్ మీద ఎంతో దృష్టి పెట్టే వాళ్ళు. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే వీరి నటన మాత్రం ఆకట్టుకుంది, మెప్పించింది, నవ్వించింది. వీరు ఇప్పుడు కనపడక బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రస్తుతం బ్రహ్మానందం అవకాశాలు రాక సినిమాలకు దూరంగా ఉన్నారు. తెలుగు తెరను మీద తనదైన ముద్ర వేసుకుని దాదాపు అందరు అగ్ర హీరోల సినిమాల్లోనూ ఆయన నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: