ఒకప్పటి స్టార్ హీరోయిన్ గా సూపర్ క్రేజ్ సంపాదించిన రోజా కొన్నాళ్ళు కెరియర్ లో వెనుకపడ్డా ఇప్పుడు మళ్ళీ ఇటు సినిమాల్లో.. అటు రాజకీయాల్లో ఫుల్ బిజీ అయ్యింది. సినిమాల్లో కన్నా స్మాల్ స్క్రీన్ పై రోజా సందడి ఎక్కువ కనబడుతుంది. ఏ ముహూర్తాన రోజా జబర్దస్త్ షోకి ఓకే చెప్పిందో కాని అప్పటి నుండి రోజా క్రేజ్ డబుల్ అయ్యింది. సినిమా గ్లామర్ ఈ షోకి బాగా ప్లస్ అయ్యింది. పాలిటిక్స్ లో ఎంత బిజీగా ఉన్నా సరే జబర్దస్త్ కు మాత్రం టైం కేటాయిస్తారు రోజా.

 

స్మాల్ స్క్రీన్ పై తనకు ఉన్న ఈ ఫాలోయింగ్ ఆమెకు మరింత క్రేజ్ తెచ్చిపెడుతుంది. అయితే పండుగ వచ్చింది అంటే జబర్దస్త్ టీం అంటా కలిసి చేసే హంగామా వేరేలా ఉంటుంది. ప్రతి పండుగకి ఏదో ఒక కాన్సెప్ట్ అనుకోవడం.. అందులో జబర్దస్త్ ఆర్టిస్టులు అందరు పాల్గొనడం చూస్తూనే ఉన్నాం. అయితే అందులో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ప్రత్యేకంగా నిలుస్తుంది. ఎప్పటిలానే రాబోతున్న ఉగాది పండుగ సందర్భంగా డ్యాన్స్ తో దద్దరిల్లేలా చేశారు జబర్దస్త్ టీం. పండుగ సర్ పండుగంతే షోలో రోజా డ్యాన్స్ కుమ్మేసింది. ఆమె పార్ట్ నర్ గా శేఖర్ మాస్టర్ కూడా అదరగొట్టాడు.

 

వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ డ్యాన్స్ లో బాగా కుదిరింది. ఇక షో కాన్సెప్ట్ ప్రకారం రెండు టీం లు.. వారి మధ్య పోటీ అది సర్వసాధారణం. డ్యాన్స్ లో రోజా గ్రేస్ అప్పటికి ఇప్పటికి అలానే ఉంది. శేఖర్ మాస్టర్ కు ఏమాత్రం తగ్గకుండా రోజా డ్యాన్స్ చేసింది. షో అంతా వీరిద్దరే హైలెట్ గా నిలిచేలా ఉన్నారు. నాగబాబు బయటకు వచ్చాక జబర్దస్త్ మొత్తం రోజా హవా నడుస్తుంది. రోజా స్మాల్ స్క్రీన్ పై సత్తా చాటడం చూసి ఆమె ఏజ్ గ్రూప్ హీరోయిన్స్ అంతా షాక్ అవుతున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: