టాలీవుడ్ ప్రముఖ నటి సుధ 500 పైగా సినిమాల్లో నటించి ఎంతో పాపులారిటీని సంపాదించింది. ఆమె సినిమాల్లో హీరోల యొక్క తల్లి పాత్రలలో నటిస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి బడా హీరోలకు కూడా తల్లి పాత్రలు ఆమె చేసి తన అద్భుత నటనా ప్రతిభను చాటింది. మరోవైపు సహ నాయకుడిగా, కథనాయకుడిగా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అసంఖ్యాకమైన సినిమాల్లో నటించి టాలీవుడ్ పరిశ్రమలో ఒక గొప్ప నటుడిగా పేరొందాడు చంద్రమోహన్.



అయితే గత రెండు దశాబ్దాలుగా ఈ ఇద్దరు నటీనటులు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కొనసాగుతూ తెలుగు ప్రేక్షక అభిమానులను ఎంతో అలరిస్తున్నారు. సెవెన్ జి బృందావన కాలనీ లో వీళ్లిద్దరూ హీరోకి తల్లిదండ్రుల పాత్రలని చాలా పర్ఫెక్ట్ గా చేసి కొన్ని కోట్ల అభిమానుల ప్రశంసలను సంపాదించుకున్నారు. కొడుకు యూజ్ లెస్ ఫెల్లో అయ్యి రౌడీ లా ఊరు మీద పడి తిరుగుతుంటే తండ్రి ఎలా రియాక్ట్ అవుతాడో చంద్రమోహన్ నటించి చూపించిన తీరు మర్చిపోలేదని చెప్పుకోవచ్చు.




2005లో కళ్యాణ్ రామ్ హీరోగా, సింధుతులానీ హీరోయిన్ గా నటించిన అతనొక్కడే సినిమాలో హీరో కి తండ్రి పాత్రలో నటించాడు చంద్రమోహన్. అయితే ఈ సినిమాలో అతని నటనకు గాను బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు లభించింది. ఢీ సినిమాలో మంచు విష్ణువర్ధన్ కు తండ్రి పాత్రను చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. అలానే విక్టరీ వెంకటేష్, ఉదయ్ కిరణ్, తరుణ్, సౌందర్య లాంటి స్టార్ నటీనటులకు తండ్రి పాత్రలు చేసి తెలుగు ఇండస్ట్రీ లో మంచి ఖ్యాతిని సంపాదించారు.

 




ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన మనసంతా నువ్వే చిత్రంలో హీరోకి అమ్మానాన్న పాత్రలను సుధ, చంద్రమోహన్ చేసారు. ఐతే వీళ్ళిద్దరూ నిజంగానే ఉదయ్ కిరణ్ కు తల్లిదండ్రుల్లా అనేలాగా వారి నటన ఉందని చెప్పుకోవచ్చు. తరుణ్ నటించిన 'నువ్వే నువ్వే' చిత్రంలో కూడా హీరోకి అమ్మానాన్న పాత్రలలో నటించి సినీ విమర్శకుల మన్నలను కూడా పొందారు. యశోసాగర్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ సినిమా ఉల్లాసంగా ఉత్సాహంగాా లో కూడా చంద్రమోహన్, సుధ కలిసి హీరో యొక్క అమ్మానాన్న పాత్రలో నటించారు. ఇలా ఈ ఇద్దరు సీనియర్ ఆర్టిస్టులు ఎన్నో సినిమాల్లో అమ్మానాన్న పాత్రలను పోషించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: