తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రెజీనా  తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఈ అమ్మడు చాలా సినిమాల్లో నటించింది. అంతేకాదు ఈ అమ్మడి అందాల ఆరబోతతో కూడా ఎంతో మంది ప్రేక్షకుల మతి పోగొట్టింది. ఇక మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో నటించిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా ఈ అమ్మడికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాత కూడా మంచి అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోయింది ఈ అమ్మడు. ఓవైపు అందాల ఆరబోత చేస్తూనే మరోవైపు నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను కూడా చేస్తోంది. అయితే ఈ అమ్మడు ఇప్పటి వరకు చాలా సినిమాలు చేసినప్పటికీ కేవలం చిన్న హీరోల సినిమాల్లో మాత్రమే ఛాన్సులు కొట్టేసింది. కానీ తాజాగా మాత్రం ఓ బంపర్ ఆఫర్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. 

 

 

మెగాస్టార్ చిరంజీవి 152 వ  సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఆచార్య అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మెసేజ్ ఓరియెంటెడ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాలో రెజీనా ఒక స్పెషల్ సాంగ్ కోసం ఆఫర్ ను  కొట్టేసింది. ఇప్పటి వరకూ చిన్న చిన్న హీరోల సినిమాల్లో మాత్రమే నటించిన రెజీనా  ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో  ఎంట్రీ ఇవ్వబోతోంది. రీసెంట్ గా రెజీనా కనిపించబోతున్న ఈ పాటకు సంబంధించిన చిత్రీకరణ కూడా జరిగినట్లు సమాచారం.

 

 

 అయితే చిరంజీవితో కలిసి డాన్స్ స్టెప్పులు వేయాలని ఎంతో మంది హీరోయిన్లు వేయికళ్లతో ఎదురుచూస్తూ ఉంటారు.ఆ  అదృష్టం ఏకంగా రెజీనా కు దక్కింది. అయితే మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ చేయడం గురించి మాట్లాడిన రెజీనా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. నేను డాన్స్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతాను... అది కూడా మెగాస్టార్ చిరంజీవి గారి తో అంటే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే అడగగానే మరో ఆలోచన లేకుండా సినిమాలో ఒక పాట చేసేందుకు ఓకే చెప్పాను. మెగాస్టార్ చిరంజీవి గారి తో డాన్స్ చేసేందుకు అవకాశం ఇచ్చినందుకు థాంక్స్ అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఈ పాటను ఆరు రోజులపాటు చిత్రీకరించారని మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ చూసి ఇన్స్పైరింగ్ గా అనిపించింది రెజీనా కసాండ్రా చెప్పుకొచ్చింది. ఇక తన డాన్స్ ను చూసి మెగాస్టార్ చిరంజీవి గారు అభినందించడం ఎంతో సంతోషంగా అనిపించింది అని తెలిపిన రెజీనా... ఇలాంటి సాంగ్స్ ఇదే మొదటిసారి ఇదే చివరిసారి అని తేల్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: