తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు అటు తమిళ ఇండస్ట్రీలో కూడా మిల్కీబ్యూటీ తమన్నాకి ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. హీరోయిన్ గా తమన్నా సినీ ఇండస్ట్రీకి పరిచయమై పదిహేనేళ్లు దాటిపోయింది... ఇప్పటికి ఈ అమ్మడి క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఇక మిల్కీ బ్యూటీ హొయలు అందాలలో ఎక్కడ మార్పు కూడా రాలేదు. పదిహేనేళ్ల తమన్నా కెరీర్ లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా దాదాపు అందరు హీరోలతో రొమాన్స్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఎంతమంది కొత్త హీరోయిన్లు వచ్చినా తమన్నాకు వచ్చే అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పటికే మూడు పదుల వయస్సు దాటి పోతున్నప్పటికి ఈ అమ్మడు పెళ్లి ఊసు  మాత్రం ఎత్తడం లేదు. ఇక వరుస సినిమాలతో పాటు ఇండస్ట్రీలో ఇంకా అందాల ఆరబోతతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. 

 

 

 తాజాగా ఓ ఇంటర్వ్యూకి హాజరైన  తమన్నాకి  పెళ్లి విషయంపై ప్రశ్న ఎదురువ్వగా ఓ ఆసక్తికర సమాధానం ఇచ్చింది మిల్కీబ్యూటీ. మీరు పెళ్లి చేసుకోవాలనుకునే వ్యక్తిలో ఉండాలనుకునే లక్షణాలు ఏ  హీరోలో  ఉన్నాయి అని ప్రశ్నించగా ఆసక్తిగల సమాధానం చెప్పొచ్చు. ఒకవేళ తనకు స్వయంవరం ఏర్పాటు చేస్తే ఆ ముగ్గురు హీరోలు కూడా స్వయంవరానికి పిలుస్తాను అంటూ చెప్పుకొచ్చింది. విక్కీ కౌశల్, హృతిక్ రోషన్, ప్రభాస్ ఈ ముగ్గురు హీరోలు కూడా స్వయంవరానికి హాజరు కావాలంటూ పిలుస్తాను అని తమన్నా  చెప్పుకొచ్చింది. 

 

 

 తన భర్తకు కాబోయే లక్షణాలు ఈ ముగ్గురు హీరోల్లో ఉన్నాయి అని చెప్పకనే చెప్పింది మిల్కీ బ్యూటీ తమన్నా. మొత్తంగా తనకు కాబోయే భర్త ఎలా ఉండాలి అనే దానిపై మాత్రం ఓ క్లారిటీ ఇచ్చింది. ఇక తనకు కాబోయే భర్త కావాలనుకునేవారిలో ఏకంగా సౌత్ స్టార్ ప్రభాస్ కూడా ఉండడం విశేషం. అయితే ఇప్పటికే మిల్కీ బ్యూటీ తమన్నా రెబల్స్ స్టార్  ప్రభాస్ తో  కలిసి రెబల్,  బాహుబలి, బాహుబలి 2 చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ఏదేమైనా తమన్నా చెప్పిన సమాధానం చూస్తే ఈ అమ్మడు తన పెళ్లిపై భారీ ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం కెరీర్ లో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నా  ఈ అమ్మడు చూపు పెళ్లి వైపు ఎప్పుడూ మల్లుతుందో మరి .

మరింత సమాచారం తెలుసుకోండి: