గ్లామర్‌ ఫీల్డ్‌ లో హీరోయిన్‌ గా ఫాంలో ఉన్న నటీమణులు తల్లి పాత్రల్లో చేసేందుకు పెద్దగా ఇంట్రస్ట్ చూపించరు. ఒకసారి తల్లి పాత్రలో కనిపిస్తే ఇక హీరోయిన్‌ గా ఆమె కెరీర్‌ ముగిసిపోయినట్టే అని భావిస్తారు. అందుకే అమ్మ పాత్రలకు మొహమాటం లేకుండా నో చెప్పేస్తుంటారు. హీరోలకు తల్లిగా కాదు కనీసం చిన్న పిల్లల తల్లి పాత్రలో నటించేందుకు కూడా మన హీరోయిన్లు ఇంట్రస్ట్ చూపించరు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా హీరో పాత్రకు తల్లిగా నటించి మెప్పించింది ఓ భామ.

 

కొన్ని అవకాశాలు చాలా అరుదుగా వస్తాయి. అలాంటి అరుదైన అవకాశమే బాహుబలి లో నటించే చాన్స్. ఈ సినిమాలో హీరోయిన్‌ గా నటించింది అనుష్క. అయితే ఈ సినిమా కోసం ఓ రిస్క్ చేసింది అనుష్క. ఇంక అక్క పాత్రలు  కూడా చేయని అనుష్క ఈ సినిమాలో ఏకంగా ప్రభాస్‌ కు తల్లిగా కనిపించింది. బాహుబలి సినిమాలో దేవసేన పాత్రలో కనిపించిన అనుష్క, తొలి భాగంలో అసలు హీరోయినే కాదు.

 

బాహుబలి ఫస్ట్ పార్ట్‌ అనుష్క్ తెర మీద కనిపించింది చాలా తక్కువ సమయమే. ఆ కొద్ది సేపు కూడా ఆమె గ్లామర్‌ రోల్‌ లో కనిపించలేదు. పూర్తిగా తెల్ల జుట్టుతో డీగ్లామర్‌ రోల్‌ లో కనిపించింది అనుష్క. అప్పటికే పాతికేళ్ల కొడుకు ఉన్న తల్లి పాత్రలో నటించింది. హీరోయిన్‌ గా ఫుల్‌ ఫాంలో ఉండగానే ఇలాంటి సినిమా చేయటం రిస్క్‌ అనే చెప్పాలి. అయితే బాహుబలి లాంటి భారీ ప్రాజెక్ట్ కోసం ఆ రిస్క్ చేసింది అనుష్క. అందుకు తగ్గ ఫలితం కూడా వచ్చింది. ఈ సినిమాలో అనుష్క నటనకు అద్భుతమైన రెస్సాన్స్‌ వచ్చింది. ఇదే సినిమాలో యంగ్ హీరో రానా కూడా ఓ కొడుకు తండ్రిగా నటించి ఆకట్టుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: