అజ్ఞాతవాసి సినిమా తర్వాత పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత సినిమాల వైపు తిరిగి చూడలేదు. కానీ దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత మరోసారి బాలీవుడ్ హిట్ మూవీ పింక్ రీమేక్ తో  సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే పింక్ రీమేక్ సినిమా కి వకీల్ సాబ్ అనే టైటిల్ ను ఖరారు చేసారు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి విడుదలైన మగువా  మగువా అనే పాట... యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. ఇక ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాతో పాటు ఇప్పటికే నాలుగు సినిమాలను కమిటయ్యారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాకి సైన్  చేశారు. 

 

 

ఇక మరో రెండు సినిమాలు కూడా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక చాలా గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడంతో అటు  అభిమానులు పవన్ సినిమా కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రి ఎంట్రీ మూవీ అయిన వకీల్ సాబ్ చిత్రాన్ని మే 15 న రిలీజ్ చేయాలని భావించింది చిత్రబృందం. కానీ ఈ విషయంలో పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమా డేట్ కన్నా ఇంకా నెల రోజుల పాటు విడుదల ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

 

 

 ఈ నెలాఖరులోపు ఈ సినిమా చిత్రీకరణ పూర్తి అవ్వాలని పవన్  ప్లాన్. కానీ ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో... ఈ ఎన్నికలు జనసేన పార్టీ కీలకం గా మారిపోయాయి. దీంతో ఈ ఎన్నికల  బిజీలో  డేట్స్ అడ్జెస్ట్ చేయలేక పోతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. దీంతో ఈ సినిమా విడుదల నెల రోజులు ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ కూడా త్వరలో రాబోతున్న ట్లు సమాచారం. ఈ సినిమాలు నివేద థామస్అనన్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక పవన్ సరసన హీరోయిన్ గా  పూజా హెగ్డే నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: