సినిమాల్లో అమ్మ పాత్రలు వెయ్యాలి అంటే కాస్త గట్స్ ఉండాలి. ఎందుకంటే స్టార్ హీరోల పక్కన చేసేది సాధారణ నటులు కాబట్టి ధైర్యంగా చెయ్యాలి. అమ్మ పాత్ర అనగానే నటి ఎంపిక నుంచి ఆమె నటించే సన్నివేశాల వరకు దర్శకులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆమెకు రాసే మాటలు కూడా అలాగే జాగ్రత్తగా ఉంటాయి. ఇక ఆమె సన్నివేశాల విషయంలో హీరోలు అభ్యంతరం చెప్పకుండా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక స్టార్ హీరోయిన్లు కూడా అంతే... హీరోయిన్ తనకు నటించే అమ్మ విషయంలో కాస్త అభ్యంతరాలు చెప్పే అవకాశం ఉంటుంది. 

 

ఒక నటిని మాత్రం చాలా మంది అమ్మగా అంగీకరించారు. అలాగే కీలక నటులు భార్యగా అంగీకరించారు. హీరోలు అత్తగా అంగీకరించారు. ఆమె ఎవరో కాదు సుధా... ఇప్పుడు అంటే నటులు ఎక్కువై ఆమె కనుమరుగు అయ్యారు గాని... దాదాపు అందరు హీరోలకు ఆమె అత్తగారిగా, అమ్మగా, మేనత్త గా నటించి మెప్పించారు. టాలీవుడ్ లో సుధా ఒకప్పుడు డిమాండ్ ఉన్న నటి. అప్పుడే కెరీర్  లో నిలబడుతున్న హీరోలకు ఆమె మంచి స్ఫూర్తి ఇచ్చే వారని టాలీవుడ్ జనం అంటూ ఉంటారు. 

 

ప్రకాష్ రాజ్, చంద్రమోహన్ తో పాటుగా ధర్మవరపు సుబ్రమణ్యం భార్యగానూ నటించారు ఆమె. తరుణ్, ఉదయ్ కిరణ్, వెంకటేష్, మహేష్ బాబు ఇలా చాలా మందికి ఆమె తల్లిగా నటించారు. మేనత్తగా నటించారు. చాలా మంది హీరోయిన్స్ కి ఆమె అమ్మగా నటించే వారు. ఆమె పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే ఆమె నటించే వారు. ఎలాంటి హీరో అయినా సరే తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే ఆమె నటించే వారు. ఇప్పుడు నటిస్తున్న చాలా మంది నటీమణులు తమ పాత్రకు ప్రాధాన్యత లేకపోయినా సరే నటిస్తున్నారు. పవిత్రా లోకేష్ పాటుగా కొందరు అవకాశం వస్తేనే చాలు అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: