అన్నపూర్ణమ్మ... టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి. ఎందరో హీరోలకు తల్లిగా, హీరోయిన్స్ అమ్మగా, ఎందరో నటుల పక్కన భార్యగా ఆమె నటించి మెప్పించారు. చాలా మంది సీనియర్ నటులకు ఆమె తల్లి పాత్రలు వేసారు అప్పట్లో. తనకంటూ పెద్ద వాడు అయిన ఎన్టీఆర్ కి కూడా ఆమె తల్లిగా నటించారు ఆకట్టుకున్నారు. చాలా మంది దర్శకులు ఆమెను తమ సినిమాల్లో నటించాలి అని కోరే వారు. నిండు తెలుగుధనంతో ఆమె ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ని కూడా ఏర్పాటు చేసుకున్నారు ఆమె. 

 

చలపతి రావు, కోటా శ్రీనివాసరావు పక్కన ఆమె భార్యగా నటించారు. మావగారు సినిమాలో ఆమె కోటా కు భార్యగా నటించారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో ఈమె కోటా కు భార్యగా నటించారు. ఆమె పాత్రలకు కూడా అదే స్థాయిలో ప్రాధాన్యత ఉండేది. తనకు పిల్లలు లేకపోయినా సరే సినిమాలో తల్లి గా చాలా మందికి నటించారు ఆమె. అగ్ర హీరోలతో పోటీగా ఆమె నటించారు. అప్పట్లో ఆమె పారితోషికం కూడా ఎక్కువగానే తీసుకునే వారు. పాత్రకు అలా డిమాండ్ ఉండేది మరి. 

 

ఈ మధ్య కాలంలో ఆమె భర్త లేని భార్యగా అమ్మమ్మ పాత్ర ల్లో కనపడుతున్నారు. అప్పుడప్పుడు అలాంటి పాత్రలు నటిస్తున్నారు. ఇంటి పెద్దగా కూడా నటిస్తున్నారు. కృష్ణా జిల్లా యాసలో ఆమె ఆకట్టుకునే వారు. ఈమె తల్లి పాత్ర వేస్తున్నారు అంటే ఆమె పాత్రకు ఉండే ప్రాధాన్యతను హీరోలు ముందు అడిగి తెలుసుకునే వారు. తనకంటే చిన్న వారిని ఆమె గౌరవించే వారు. ముఖ్యంగా ఆమె మాట్లాడే మాటలు బాగా హైలెట్ అవుతూ ఉంటాయి సినిమాల్లో. aఆ సినిమాలో బేబి మామ్మ గా ఆమె నటన ఆకట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: