సినిమా అనే రంగుల ప్ర‌పంచంలోకి ఎంద‌రో ఎంట్రీ ఇస్తుంటారు. ఏదో సాధించాల‌ని ప్ర‌య‌త్నిస్తుంటారు. ఇక సినిమా విష‌యానికి వ‌స్తే.. హీరో, హీరోయిన్‌, విల‌న్ ఎంత ముఖ్య‌మో.. సైడ్ క్యారెక్ట‌ర్స్ కూడా అంతే ముఖ్యం. అమ్మా, నాన్న‌లుగా, అత్తా, మామ‌లుగా, అక్కా, బావ‌లుగా ఎంతో వినోదాన్ని పంచిన వాళ్లు, త‌మ న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను క‌న్నీరు పెట్టించిన వాళ్లు ఎంద‌రో ఉన్నారు. అలాగే రియ‌ల్ లైఫ్‌లో భార్యాభ‌ర్త‌లు అయిన జంట‌లు.. రీల్ లైఫ్‌లోనూ భార్యాభ‌ర్త‌లు న‌టించారు. అందులో విజయ్‌ కుమార్, దివంగ‌త న‌టి మంజుల కూడా ఒక‌రు.

 

తెలుగు, తమిళం, కన్నడలో సుమారు వంద చిత్రాల్లో పైగా నటించిన మంజుల... ప్రముఖ నటుడు విజయ్ కుమార్ సతీమణి. 1969లో 'శాంతి నిలయం' ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన మంజుల అనతి కాలంలోనే అగ్ర నటుల సరసన నటించింది.  మ‌రియు విజయ కుమార్ మొదటి సారిగా 1961 లో శ్రీవల్లి అనే తమిళ సినిమాలో బాలనటుడిగా నటించాడు. ఇక విజ‌య్ కుమార్ మ‌రియు మంజులు రీల్ లైఫ్‌లోనూ భార్యాభ‌ర్త‌లుగా న‌టించారు. వెంక‌టేష్‌, భూమిక హీరోహీరోయిన్లుగా వ‌చ్చిన చిత్రం వాసు.  ఈ చిత్రంలో వెంక‌టేష్‌కు విజయ్‌ కుమార్, మంజుల త‌ల్లిదండ్రులుగా న‌టించి మెప్పించారు.

 

అలాగే అమితాబ్ జయ కూడా పెళ్లి త‌ర్వాత భార్యాభ‌ర్త‌లుగా న‌టించారు. వాస్త‌వానికి అమితాబ్‌ సినిమా కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం 1973లో ప్రకాశ్‌ మెహ్రా దర్శకత్వంలో వచ్చిన ‘జంజీర్‌’. ఈ సినిమాలో హీరోయిన్‌గా జయనే అమితాబ్‌ ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత కూడా జయ, అమితాబ్‌ల జోడీ అనేక చిత్రాల్లో సందడి చేసింది. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘అభిమాన్‌’ చిత్రంతో రెండవసారి అమితాబ్‌ ఫిలింఫేర్‌ అవార్డును అందుకున్నాడు. 1974లో వచ్చిన ‘కుంవారా బాప్‌’, ‘దోస్త్‌’, రోటీ కపడా ఔర్‌ మకాన్‌’ సినిమాల్లో చిన్న, సహాయనటుడి పాత్రల్లో కనిపించి తన నటనతో మెప్పించారు అమితాబ్‌. 


 


 

మరింత సమాచారం తెలుసుకోండి: