తెలుగు సినిమాల్లో ఆరోగ్యకరమైన హాస్యానికి నిలువెత్తు నిదర్శనం జంధ్యాల. ఆయన రచనలో, కథనంలో, దర్శకత్వంలో వచ్చిన అనేక సినిమాలు ఇదే నిజమాని నిరూపిస్తాయి. ఆయన దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమాలోని సునిశిత హాస్యం హస్య ప్రియుల్నే కాకుండా తెలుగు ప్రేక్షకులందరినీ హాస్యపు జల్లుల్లో ముంచెత్తేది. ముఖ్యంగా.. ఎటువంటి మేనరిజమ్స్ లేకుండా ఆయన రాసిన సంభాషణలు ప్రేక్షకుల మనసులను సుతిమెత్తగా తాకి మనసారా నవ్వుకునేలా చేసాయి. జంధ్యాల కురిపించిన ఎన్నో హాస్యపు జల్లుల్లో మరుపురానిది ‘బాబూ చిట్టీ’.. అనే డైలాగ్.

 

 

రాజేంద్రప్రసాద్ – చంద్రమోహన్ హీరోలుగా 1989లో వచ్చిన జయమ్ము నిశ్చయమ్మురా అనే సినిమాలో శ్రీలక్ష్మి చేత పలికించిన డైలాగ్ ఇప్పటికీ హాట్ ఫేవరేట్. ఎన్నో స్ఫూఫ్ లకు ఈ డైలాగ్ ను ఉపయోగిస్తూంటారు. అనేక రాజకీయ వ్యంగ్యానికి శ్రీలక్ష్మి చెప్పిన డైలాగే ఉపయోగిస్తారు. ఆ సినిమాలో జంటగా నటించిన బ్రహ్మానందం – శ్రీలక్ష్మి వారి పాత్రలకు ప్రాణం పోశారనే చెప్పాలి. ఆనందం, బాధ, కోపం, విచారం.. ఇలా ఎటువంటి భావన కలిగినా వెంటనే శ్రీలక్ష్మి ఈ డైలాగ్ చెప్పి ఆకట్టుకుంది. శుభలగ్నం సినిమాలో కూడా బ్రహ్మీ – శ్రీలక్ష్మి చేసిన కామెడీ సినిమాకి ప్రాణం పోసింది.

 

 

సినిమా అంతా ఎంత సెంటిమెంట్ కధాంశమో మధ్యలో వచ్చే వీరిద్దరి చక్కటి హాస్యం ప్రేక్షకులకు ఉల్లాసాన్ని ఇచ్చింది. అబ్బ.. దబ్బ.. జబ్బ అంటూ మూగ అమ్మాయి పాత్రలో శ్రీలక్ష్మి, ఆమె ప్రియుడిగా బ్రహ్మానందం మంచి హాస్యాన్ని పండించారు. అప్పటి వరకూ కామెడీ ఒకెత్తయితే శ్రీలక్ష్మికి మాటలు వచ్చాక చేసే కామెడీ మరొక ఎత్తు. భలే దంపతులు, బ్రహ్మచారి మొగుడు, బావా బావా పన్నీరు, భామా కలాపం, భానుమతి గారి మొగుడు, చాణక్య శపథం, టోపీ రాజా స్వీటీ రాజా.. వంటి సినిమాల్లో వీరి కామెడీ హైలైట్ గా నిలిచింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: