రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ నటిస్తుండగా రాజమౌళి బంధువైన ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. బాహుబలి సినిమాకి రాజమౌళి దర్శకత్వం వహించగా తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథని అందించారు. అయితే, రాజమౌళికి అన్న వరసైన ఎం.ఎం కీరవాణి ఆ సినిమాకి అద్భుతమైన సంగీతాన్ని అందించి దానికి ప్రాణం పోశాడు. వాస్తవానికి రాజమౌళి, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, రాజమౌళి అన్న ఎం.ఎం కీరవాణి కలిసే ఏ సినిమానైనా రూపుదిద్దుతారు. ఐతే తాజాగా షూటింగ్ ని శరవేగంగా జరుపుకుంటున్న ఆర్.ఆర్.ఆర్ చిత్రానికి కీరవాణి సంగీత బాణీలు అందిస్తుండగా... అతను తీసుకునే రెమ్యునరేషన్ ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.




నిజం చెప్పుకోవాలంటే... ఎంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కి అయినా ఒక సినిమా చేస్తే రూ.4 నుండి 5 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుతుంది. అయితే ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్ రెహమాన్ మాత్రం ఏడు కోట్ల పారితోషకం తీసుకుంటాడు. ఐతే ఇప్పటివరకు భారతదేశంలో ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఒక్క సినిమాకి 7కోట్ల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోలేదు. కానీ ఏ.ఆర్.రెహమాన్ కి రెట్టింపు రెమ్యునరేషన్ ని మన తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఎం.ఎం కీరవాణి తీసుకోబోతూ అన్ని రికార్డుని బద్దలు కొట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు.




నివేదికల ప్రకారం... ఎం.ఎం కీరవాణి ఆర్ఆర్ఆర్ చిత్రానికి సంగీతం సమకూరుస్తునందుకుగాను అక్షరాలా రూ.16 కోట్లను తీసుకుంటున్నారట. అస్సలు ఇప్పట్లో మిడిల్ రేంజ్, కొంతమంది సీనియర్ హీరోలు కూడా అంత పారితోషకం తీసుకోరు. కానీ ఎం.ఎం కీరవాణి మాత్రం ఇన్ని కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోవడం గమనార్హం. ఏది ఏమైనా రెమ్యూనరేషన్ ని ప్రత్యేకంగా తీసుకొని రాజమౌళి కుటుంబ సభ్యులు ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తి కావటంలో తమవంతుగా చెప్పుకోదగ్గ పని చేస్తున్నారని తెలుస్తుంది. అందుకే కీరవాణికి నిర్మాతలు అన్ని కోట్ల డబ్బుని ఇచ్చేసి వార్తలో నిలవాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఎం.ఎం కీరవాణి 16 కోట్లు తీసుకున్న ఆర్ఆర్ఆర్ సినిమాకి ఎట్లా సంగీతం కొట్టారో అని పాటలు వినేవారు, సినిమా చూసేవారు ఉండరా అనేది నిర్మాతల ప్రమోషన్ ఆలోచన. 

మరింత సమాచారం తెలుసుకోండి: