మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో మ్యూజికల్ హిట్ సినిమాలు ఉన్నాయి. చిరంజీవి సినిమాల్లో ఫెయిల్యూర్స్ ఉన్నాయి కానీ మ్యూజికల్ గా ఏ సినిమా కూడా ఫెయిల్యూర్ కాలేదు. చిరంజీవి సినిమాల్లో అలాంటి మ్యూజికల్ హిట్స్ లో ఒక సినిమా చెప్పుకోవాల్సింది కొండవీటి దొంగ సినిమా గురించే. ఈ సినిమా రిలీజ్ అయి నేటితో 30ఏళ్లు పూర్తి చేసుకుంది. 1990 మార్చి 9న వేసవి సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. చిరంజీవికి 9వ తేది రిలీజ్ ఎంతగా కలిసొస్తుందో ఈ సినిమా ద్వారా మరోసారి ప్రూవ్ అయింది.

IHG

 

చిరంజీవిఇళయరాజా కాంబినేషన్లో వచ్చిన క్లాసిక్స్ లో కొండవీటి దొంగ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. చిరంజీవి – రాధ పై వచ్చే ‘శుభలేఖ రాసుకున్నా..’ పాట ఇప్పటికీ మ్యూజిక్ లవర్స్ కు మెగాభిమానులకు హాట్ ఫేవరేట్ సాంగ్. పాట పిక్చరైజేషన్, చిరంజీవి డ్యాన్సులు ఈ పాటను చిరస్థాయిగా నిలిపాయి. చిరంజీవి – విజయశాంతిపై వచ్చే ‘చమకు చమకు చాం..’ అనే పాట మెగాభిమానులను సీట్లలో నిలువనీయలేదు. అప్పటికే బ్రేక్ డ్యాన్సులతో ట్రెండ్ సృష్టించిన చిరంజీవి ఈ పాటలో వేసిన స్లో స్టెప్స్ పాటకు ఎంత అందం తీసుకొచ్చిందో చూస్తేనే తెలుస్తుంది. చిరంజీవితో విజయశాంతి-రాధ కలిసి చేసిన నాలుగో సినిమా కొండవీటి దొంగ.

IHG

 

విజయలక్ష్మీ ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై నిర్మాత త్రివిక్రమరావు ఈ సినిమాను నిర్మించారు. చిరంజీవితో ఆయనకు ఇది మూడో సినిమా. చిరంజీవి-కోదండరామిరెడ్డి కాంబోలో వచ్చిన మరో సూపర్ హిట్ గా ఈ సినిమా నిలిచింది. చిరంజీవి సినిమాలో అమ్రిష్ పురి విలన్ గా నటించిన తొలి సినిమా ఇది. 36 సెంటర్లలో ఈ సినిమా 100 రోజులు ఆడి శతదినోత్సవం జరుపుకుంది. మెగాభిమానులకు, ఈ సినిమామధుర జ్ఞాపకం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: