టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం శ్రీనువైట్ల డైరక్షన్ లో ఆగడు మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ అత్యంత వేగంగా జరుపుకుంటుంది. మహేష్ దూకుడు, 1 సినిమాలను నిర్మించిన 14 రీల్స్ రాం ఆచంట, గోపి ఆచంట, అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  1 సినిమాతో కొద్దిగా నిరుత్సాహానికి గురైన మహేష్ ఈ సినిమాను పక్కా కమర్షియల్ యాంగిల్ లో సినిమాను తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమాలో రాయలసీమ యాసలో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని అలరించనున్నాడు. థమన్ మ్యూజిక్ డైరక్షన్ అందిస్తున్న ఈ సినిమాలో ఫస్ట్ టైం తమన్న మహేష్ కి జోడీగా నటిస్తుంది. ఈ సినిమాలో మరోసారి మహేష్ పోలీస్ క్యారక్టర్ లో నటిస్తున్నాడట. తమన్నా కూడా ఆగడులో పోలీస్ గా చేస్తుందని సమాచారం. సో దూకుడు తో సూపర్ హిట్ కొట్టిన సూపర్ స్టార్ మహేష్ ఆగడుతో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని కోరుకుంటుంది ఎపిహెరాల్డ్.కామ్. ఆగడు సినిమా మహేష్ కి హిట్ ఇస్తుందా..?   

మరింత సమాచారం తెలుసుకోండి: