ఎస్వీబీసీ మాజీ చైర్మన్, నటుడు 30 ఇయర్స్ పృథ్వీ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. పృథ్వీ 1979 లో నాన్ వళవయ్యప్పన్ అనే తమిళ సినిమాలో బబ్లూ అనే పేరుతో బాలనటుడిగా సినీరంగ ప్రవేశం చేశాడు. తరువాత 1990, 2000 దశకాల్లో తమిళ, తెలుగు సినిమాల్లో ఎక్కువగా సహాయ పాత్రలు, అప్పుడప్పుడూ ప్రతినాయకుడిగా కనిపించాడు. మ‌రియు అనేక సినిమాల్లో త‌న‌దైన కామెడీని పండించి ప్రేక్ష‌కుల‌కు వినోదాన్ని పంచాడు. ఇక మ‌రోవైపు రాజ‌కీయాల్లోనూ కూడా కాస్త ఆకట్టుకునే ప్రయత్నం చేసారు. అయితే అక్కడ ఆయన తన నోటి దురుసు సహా కొన్నింటి తో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. 

 

అలాగే ఇటీవ‌ల పృథ్వీరాజ్ ఇటీవల తీవ్ర వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఎస్వీబీసీ ఛైర్మన్‌గా ఉన్న ఆయన.. ఓ మహిళా ఉద్యోగినితో సరస సంభాషణ జరిపినట్టు వెలుగులోకి వచ్చింది. ఓ ఉద్యోగినితో మద్యం తాగాలని తాను కోరుకుంటున్నట్టు, కౌగించుకుందామని అనుకున్నట్టు చెప్పిన విషయాలు బహిర్గతం అయ్యాయి. ఈ ఆడియో టేప్ నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది. దీంతో పృథ్వీ ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక ప్ర‌స్తుతం పృథ్వీ అటు సినిమా ఛాన్సులు లేక‌.. ఇటు రాజ‌కీయాల్లో ప్ర‌భావం చూప‌లేక చాలా కాలం నుంచి ఖాళీగానే ఉంటున్నారు. 

 

అవ‌కాశాలు క‌రువ‌వ‌డంతో.. ఆయ‌న చాలా ఇబ్బంది పడుతున్న‌ట్టు తెలుస్తోంది. అందుకే ఏమో తాజాగా కొన్ని వ్యాఖ్యలు కూడా చేసారు పృథ్వీ. సినిమాల్లో అవకాశాలు ఇచ్చేవాడు లేడు.. కనీసం ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఫోన్ చేయలేదని చెప్పాడు ఈయన. తన చుట్టూ ఉన్న వాళ్లే ఇప్పుడు తనను పట్టించుకోవడం లేదని చెప్పుకొచ్చాడు. ఓ సమయంలో చచ్చిపోవాలనుకున్నానని.. అప్పుడు తనకు అండగా నిలిచింది చిరంజీవి అని తెలిపారు. 

 

పాపం వాడెలా ఉన్నాడో చూడండ్రా అంటూ కొందరికి చెప్పాడని.. అంత గొప్పవాడు ఇండస్ట్రీలో మరొకరు లేరని చిరంజీవిపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు పృథ్వీ. కాగా, గ‌తంలో మెగా ఫ్యామిలీపై వివాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన పృథ్వీనే మ‌ళ్లీ ఇప్పుడు చిరుపై ప్ర‌శంస‌లు కురిపించ‌డంతో హాట్ టాపిక్‌గా మ‌రింది.

మరింత సమాచారం తెలుసుకోండి: