క్లియోపాత్ర ఈ పేరు వినగానే ఈజిప్ట్ అందమైన రాణి అనే పేరు మాత్రమే కాదు. ఆమె ఒక శృంగార బానిస అనే పదం కూడా గుర్తుకు వస్తుంది. ఆమె ఈజిప్టుకు చిట్టచివరి ఫారో. క్రీస్తుపూర్వం 69లో జన్మించింది. ఆమె ఎంతో మంది మగాళ్లని కూడా తన తెలివితో, అందంతో, కుట్రలతో పన్నగాలతో, తన కోట మీద ఒక్క ఈగ కూడా వాళ్లకు కూడా చేసింది. అలాంటి క్లియోపాత్ర పేరుతో రూపొందిన ఓ ల‌ఘు చిత్రం ఇప్పుడు ఇప్పుడు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. 


మోహన్ కృష్ణ  బెల్లం కొండ, రేఖ నిరోషా హీరోహీరోయిన్లుగా AVOTALE బ్యానర్ పై  సాయి సూర్య వీరిశెట్టి సమర్పణలో అశోక్ వర్మ  తెరకెక్కించిన ప్రేమకథ ల‌ఘు చిత్రం "క్లియోపాత్ర".  శ్రీనివాస్ వడుపు ,రణధీర్ వైట్ల, బాపి రాజు లంకె సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ప్రీమియర్ షో హైద్రాబాద్ రామానాయుడులో  జరిగింది. ఈ ప్రీమియర్ ను సినీ ప్రముఖులు  దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, సంగీత దర్శకురాలు  శ్రీలేఖ, నిర్మాత సంజయ్ రెడ్డి ప్రత్యేకంగా వీక్షించి చిత్ర‌యూనిట్‌ను అభినందించారు. 

 

 ఓ కాంప్లికేటెడ్ పాయింట్ ను తీసుకొని ప్రేమకథను  తెరకెక్కించి, మెప్పించడం చాలా కష్టమ‌ని, దర్శకుడు అశోక్ వర్మ అందులో  సక్సెస్ అయ్యాడు  అని ద‌ర్శ‌క‌నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు . మొదటి  ప్రయత్నంలో ఇంత బాగా  తీయడం హర్షించ దగ్గ విషయం అన్నారు. నటులు,టెక్నిషియన్స్ కి మంచి భవిష్యత్తు ఉందని తెలిపారు .

 

సంగీత  దర్శకురాలు శ్రీలేఖ మాట్లాడుతూ... లవ్  అనేది ఎవర్ గ్రీన్ .. కొత్త ప్రేమకథను  చూసిన ఫీలింగ్ కలిగింది . నాకు క్లైమాక్స్ హార్ట్ టచింగ్ అనిపించింది . అందరు ఇంకా కష్టపడండి .. ఇంకా ముందుకు వెళ్తారని అన్నారు. నిర్మాత  సంజయ్ రెడ్డి మాట్లాడుతూ.... కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ ను బాగా తీశారని అన్నారు .. యూనిట్ సబ్యులకు అల్ ది బెస్ట్ చెప్పారు. 

 

చిత్ర  దర్శకుడు  అశోక్ వర్మ  మాట్లాడుతూ... ఈ  కథ  రాసుకున్నప్పుడు  ఈ సబ్జెక్టు  నాన్ లీనియర్ ,మల్టీ లేయర్ అని  తెలియదు .. తెలిసాక చాలెంజ్  గా తీసుకొని రోపొందించాము అన్నారు.. ఈ  ఫిలిం ఇంత బాగా రావటానికి మా టీమ్  ఎంతో సపోర్ట్ చేసిందని అన్నారు. హీరో హీరోయిన్లు  మోహన్ కృష్ణ  బెల్లం కొండ  ,రేఖ నిరోషా అవకాశం ఇచ్చిన  దర్శక నిర్మాతలకు , ప్రీమియర్ కు వచ్చిన   ముఖ్య అధితులకు థాంక్స్  తెలిపారు . ఈ  కార్యక్రమంలో  చిత్రయూనిట్ కూడా   పాల్గొన్నారు.

 

నటీనటులు:  మోహన్ కృష్ణ  బెల్లం కొండ, రేఖ నిరోషా , శివ, డా . హెచ్ .వినయ్ కుమార్ , రమ్య , ప్రవల్లిక , బేబీ సహన్య , లీలా ప్రసాద్, మ్యూజిక్  : ఫణిదీప్ విశ్వనాధ్  ,డి.ఓ .పి  : గోవిందే బాబు చర్ల, ఎడిటింగ్ : ప్రశాంత్ కంసాలి  , వి ఎఫ్ ఎక్స్  : మాంట్రిక్ స్టూడియోస్, డిఐ : పి కె అండ్ జిబిసి , ఆడియోగ్రఫీ  : అద్దంకి వెంకటేష్, టైటిల్స్  అండ్ పోస్టర్స్  : అశోక్ వర్మ లంకె, సమర్పణ  : సాయి సూర్య వీరిశెట్టి , ప్రొడ్యూసర్స్ : శ్రీనివాస్ వడుపు ,రణధీర్ వైట్ల ,బాపి రాజు లంకె, కో ప్రొడ్యూసర్స్ : శ్రీనివాస్ కోటిపల్లి  ,మౌనిక రణధీర్ రెడ్డి , డైరెక్టర్  : అశోక్  వర్మ .

మరింత సమాచారం తెలుసుకోండి: