బ్రిటిష్ అడ్వెంచరర్ బేర్ గ్రిల్స్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో 'ఇన్టూ థ వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్'(Into The Wild With Bear Grylls) అనే ఒక కార్యక్రమ ఎపిసోడ్ ని బెంగళూరు లోని బందిపూర్ టైగర్ రిజర్వ్ లో తీస్తున్నారన్న సంగతి తెలిసిందే. గతంలో ఈ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కి వెళ్ళిన రజినీకాంత్ కి ముళ్ళు గుచ్చుకొని గాయాలు కావడంతో తాను కొన్ని రోజులు విశ్రాంతి తీసుకొని మళ్లీ బేర్ గ్రిల్స్ తో సాహస విన్యాసాలు చేసేందుకు సిద్ధమయ్యాడు. అయితే రజినీకాంత్ బేర్ గ్రిల్స్ కలిసి చేస్తున్న ఎపిసోడ్ మార్చి 23వ తేదీన రాత్రి 8 గంటలకు డిస్కవరీ ఛానల్ లో ప్రసారం కాబోతుంది. ఈ క్రమంలోనే బేర్ గ్రిల్స్ ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ఒక షార్ట్ ప్రోమో ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. 

 


బేర్ గ్రిల్స్ తన ట్వీట్ లో... 'సూపర్ స్టార్ రజినీకాంత్ చెక్కుచెదరని స్థిరమైన పాజిటివిటీ, ఇంకా ఎటువంటి సమస్యలకైనా తన తల వంచని ధైర్యం ఈ ఎపిసోడ్ లో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ అడవిలో ఎదురైన ప్రతి ఒక్క చాలెంజ్ ని అతను సంతోషంగా స్వీకరించాడు', అని పేర్కొన్నాడు. 

 

 

ఇకపోతే బేర్ గ్రిల్స్ షేర్ చేసిన వీడియో లో... రజినీకాంత్ తన నరసింహ సినిమా లో సూపర్ స్టైలిష్ గా చేసే సెల్యూట్ బేర్ గ్రిల్స్ కి నేర్పిస్తూ కనిపిస్తాడు. ఐతే బేర్ గ్రిల్స్ రజినీకాంత్ స్టైల్ కి ఫిదా అయిపోయాడా లేదో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారం అయ్యే అంతవరకు వెయిట్ చేయాల్సిందే. అలాగే అడవిలో చాలా ఉత్సాహంగా పెరల్స్ ని అనుసరిస్తూ ఉరుకుతున్నట్టు ఈ వీడియోలో కనిపిస్తుంది. ఏది ఏమైనా యావత్ తమిళ రాష్ట్రంతోపాటు తెలుగు ప్రజలు కూడా రజినీకాంత్ బేర్ గ్రిల్స్ తో చేస్తున్న సాహస విన్యాసాలు చూసేందుకు బాగా వేచి చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: