మంచి పాప్యులర్ సింగర్, బిగ్ బాస్ టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ పై దాడి జరిగిన సంగతి అందరికీ తెలిసినదే. అయితే కధలా మారుతోంది ఈ ఫైట్. మొదట రాహుల్ సిప్లిగంజ్ పబ్కి వెళ్ళాడు. అక్కడ ఏదో గోడవైనందుకు అక్కడ తనని బీర్ బాటిల్స్తో కొట్టారు. ఆ తర్వాత తనని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళారు. అయితే మొదట కేసు పెట్టాకపోవడం వల్లే మరెన్నో గొడవలు రేగుతున్నాయి.

 

అయితే మన బిగ్ బాస్ టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ అసలు గొడవ పడినది ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తమ్ముడు రిషిక్ రెడ్డితో. అయితే చిన్న చిన్న మాటలు కాస్తా ఇందులో వివాదానికి దారి తీసింది. చిన్న  మాటలు కాస్త బీర్ బాటిల్స్ కొట్టుకునే దాకా తీసుకొచ్చింది. ఇంకేం ఉంది అంత పెద్దది అయ్యింది ఆ గొడవ. 

 

IHG

 


అయితే అతని స్నేహితులుతో కలిసి దాడి చేసారు. ఆ పబ్ నుండి ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఆ సాయంత్రం పోలిసులకి కంప్లేంట్ చేసాడు రాహుల్ సిప్లిగంజ్. తదుపరి మరుసటి రోజు వెళ్ళి రిషిక్ రెడ్డి అతని ఫ్రెండ్స్ రాహుల్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ గొడవపై బీజేపి నేత శ్వేతారెడ్డి దీనికంతటికి కారణం రాహులే అని మాట్లాడింది. మీడియాపై కూడా మండిపడ్డాడు రాహుల్. 

 

 

మీడియా రాహుల్ని ఎందుకు పబ్ కి వెళ్ళారు?, ఎందుకు పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు అంటే మీరు వెళ్ళరా అంటూ మండిపడ్డాడు. అతనికి అసలు మాట్లాడడమే రాదు అంటూ శ్వేతా రెడ్డి రాహుల్ని అన్నారు. అయితే కధలా మారుతోంది ఈ ఫైట్. ఎంతైనా రాజకీయ నాయకులు అంతా ఒక్కటే....అటు తిప్పి ఇటు తిప్పి రాహుల్ మీద కేస్ వేసేలా ఉన్నారే అని రాహుల్ ఫ్యాన్స్ కామెంట్స్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: