సునీల్ మంచి కమీడియన్. ఎన్నో సినిమాలలో నటించాడు. హాస్య నటుడిగా ఎన్నో సినిమాలు తీసాడు. ఆ తర్వాత తను హీరోగా కూడా రాణించాడు. అయితే వీరిద్దరు కలిసి నటించిన సినిమాలు కూడ ఉన్నాయి. సునీల్ ఉదయ్ కిరణ్ మంచి ఫ్రెండ్స్ అని అందరికీ తెలిసిన సంగతే. అయితే ఉదయ్ కిరణ్ మంచి సక్సెస్ హీరో అని కూడ మనకి తెలిసినదే

 

IHG

 

మొదట సినిమా కెరీర్లో ప్రారంభం చేసిన ఉదయ్ కిరణ్ కి వరుస హిట్స్ వచ్చాయి. ఫెయిల్యూర్ తెలియదు తనకి మొదట్లో. మంచి సినిమాలతో హ్యాట్రిక్ అందుకున్నాడు ఉదయ్ కిరణ్. ఆ విజయలతో సంచలనం సృష్టించాడు ఈ స్టార్. అయితే ఆ హీరో పేరు నిజంగా మరచిపోలేనిది. అతను లేక పోయినా అంత సులువుగా మరచిపోయే సినిమాలు కావవి. అంత మరిచిపోయే హీరోను కాదు తను. 

 

IHG

 

బ్యాగ్రౌండ్ ఉన్నా కొంత మంది హీరోలు రాణించలేరు. అలాంటిది ఏ బ్యాగ్రౌండ్ లేకుండా తన ట్యాలంట్ని నమ్ముకుని సినీ పరిశ్రమలో కి వచ్చాడు హీరో ఉదయ్ కిరణ్. అయితే అంత ఒంటరిగా వచ్చి మంచి సక్సెస్ అందుకున్నాడు అంటే ఆ ఘనత అంతా ఇంతా కాదు. ఇతని ట్యాలంట్కి, నడవడికకి మెగాస్టార్ కూడా ముగ్ధుడై పోయాడు. తన కూతురిని హీరో ఉదయ్ కిరణ్ తో పెళ్ళి చెయ్యాలనుకున్నాడట. ఈ హీరో ఎంతో చిన్న వయస్సులో నంది అవార్డు దక్కించుకున్నాడు. హీరో కమల్ హాసన్ తర్వాత అతి చిన్న వయస్సులో దక్కించుకున్న హీరో ఉదయ్ కిరణ్ మాత్రమే.

 

IHG

 

నువ్వు నేను, మనసంతా నువ్వే, శ్రీరామ్, హోలీ లాంటి సినిమాల్లో సునీల్ ఉదయ్ కిరణ్ కలిసి నటించారు. నువ్వు నేను సినిమా షూటింగ్ టైంలో నిజమైన రన్నర్స్ తో పరిగెత్తాడట ఉదయ్ కిరణ్. వాళ్ళతో పోటి పడి గెలిచేసాడట. అయితే ఎలా పరిగెత్తావు అని సునీల్ అడిగితే బస్సుల వెంట పరిగెత్తడం అలవాటు అయ్యిపోయిందని నవ్వాడట ఇలా వీళ్ళు ఎంతో నవ్వుకునే వారని సునీల్ చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: