బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రేత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న  బాలివుడ్ హీరో  అక్షయ్ కుమార్.. ఇప్పుడు అక్షయ్ కుమార్ సూర్యవంశీ అనే చిత్రంలో నటిస్తున్నారు.. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు..  ఈ సందర్భంగా ఆయన ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  మాట్లాడుతూ..తనకు మతం లేదు.. నేను భారతీయుణ్ణి అంటూ కొన్ని వ్యాఖ్యలు చేసారు.. తాను మతాన్ని విశ్వసించనని భారతీయత అనేదే తన మతమని చెప్పుకొచ్చాడు.

 


 ఇదే అంశంతో తాను సూర్యవంశీ సినిమాను తెరకెక్కించినట్టు చెప్పాడు. తాను భారతీయుడుగా ఉండటమే తనకు ఇష్టమన్నారు. మతం గురించి ఆలోచించను. హిందూ, ముస్లిమ్, సిక్కు, పార్సీ, క్రిష్టియన్ ఎవరైనా ఒక్కటే.. భారత మాత ముందు ఎవరయినా ఒక్కటే.. కులం, మతం అనే బేధం లేదు అన్నారు. భారతీయత అనే అద్దంలోంచే సమాజాన్ని చూడాలన్నారు. మా ‘సూర్యవంశీ’ చిత్రంలో కూడా  ఇదే విషయాన్ని చూపించారట. ఈ చిత్రం దేశంలోని ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టే విధంగా సినిమా ఉంటుందని అక్షయ్ కుమార్ చెప్పుకొచ్చారు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించారు.  సూర్యవంశీ సినిమా విషయానికొస్తే.. దర్శకుడు రోహిత్ శెట్టి ఈ చిత్రాన్ని ముంబాయి‌లో ఇప్పటి వరకు జరిగిన బాంబ్ బ్లాస్ట్స్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ సరసన కత్రినా కైఫ్ హీరోయిన్‌గా నటించింది. 

 


అంతేకాదు ఈ చిత్రంలో అజయ్ దేవ్‌గణ్, రణ్‌వీర్ సింగ్ ముఖ్యపాత్రల్లో నటించారు. అజయ్ దేవ్‌గణ్ సింగం పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తే.. రణ్‌వీర్ సింగ్ ‘సింబా’ గా అలరించనున్నాడు. మరోవైపు ముంబాయి బాంబ్ బ్లాస్ట్‌ల వెనక ఉన్ మాస్టర్ మైండ్ దావూద్ ఇబ్రహీం పాత్రలో జాకీ ష్రాఫ్ నటించాడు. పోలీస్ ఆఫీసర్ నేపథ్యంలో పూర్తి యాక్షన్ ఎంటర్టేనర్‌గా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు రోహిత్ శెట్టి. చాలా రోజుల తర్వాత అక్షయ్ కుమార్.. పూర్తి స్థాయి యాక్షన్ హీరోగా ఈ చిత్రంలో కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని ఈ నెల 24న విడుదల చేయనున్నారు.నిన్న ఈ సినిమా ట్రైలర్ విడుదల అయింది  కార్యక్రమానికి రణ్‌వీర్ సింగ్ 40 నిమిషాలు ఆలస్యంగా వచ్చాడన,  దీంతో అక్షయ్ కుమార్. ఆలస్యంగా వచ్చినందుకు క్రమశిక్షణ లేదంటూ.. సరదగా రణవీర్ సింగ్ తో  గుంజీలు తీయించాడు. అక్షయ్.. రణ్‌వీర్ సింగ్‌తో సరదగా గుంజీతలు తీయించిన విషయం ఎంత వైరల్ అయిందో తెలిసిందే... వీరిరువురు మధ్య ఉన్న స్నేహసంబంధానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: