టాలీవుడ్ టాప్ మ‌ల్టీస్టార‌ర్‌గా తెర‌కెక్కుత‌న్న చిత్రం `ఆర్.ఆర్‌.ఆర్‌. ద‌ర్శక ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో పీరియ‌డ్ ఫిల్మ్‌తో వ‌ర్ల‌డ్‌వైడ్‌గా విడుద‌ల‌వుతోంది. అత్యంత భారీ బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా చేస్తున్నారు. ఇంత భారీ స్టార్ క్యాస్ట్ తో చేయ‌డంతో ఈ సినిమాపైన అంచ‌నాలు పెరిగిపోయాయి. 

 

ఇక రాజమౌళి అల్లూరి సీతారామరాజు – కొమరం భీమ్ లాంటి పాత్రలకి ఫిక్షన్ కథని యాడ్ చేసి చెప్పే క‌థ ఈ చిత్రం. ఈ చిత్రం జనవరి 8, 2020లో విడుద‌ల చేయ‌డానికి ద‌ర్శ‌క‌నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. కానీ ‘ఆర్ఆర్ఆర్’ టైటిల్ కి పూర్తి  ఫుల్ ఫార్మ్ ఏంటి అన్న‌ది మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు తెలియ‌దు. అయితే సోష‌ల్ మీడియాలో మాత్రం  ఇప్పటికే ‘రామ రౌద్ర రుషితం’, ‘రఘుపతి రాఘవ రాజారాం’, అనే పలు రకాల టైటిల్స్ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. కానీ అవేవీ నిజం కాదు. ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న అయితే రావ‌ల‌సి ఉంది.

 

‘ఆర్ఆర్ఆర్’ చిత్ర టీంలోని ఓ ప్రముఖ వ్యక్తి టైటిల్ గురించి చెప్పిందేమిటంటే... ‘రాజమౌళి అండ్ టీం చాలా రోజులుగా టైటిల్స్ గురించి పలు రకాలు పరిశీలించి ఫైనల్ గా ‘రామ రావణ రాజ్యం’ అనే టైటిల్ ని ఫిక్స్ చెయ్యాల‌నుకుంటున్నార‌ని స‌మాచారం. అయితే కథ ప్రకారం రాముడు – రావణుడు పాత్రలని కొంత కథలోని హీరోల పాత్రల పేర్లు గుర్తు చేసేలా ఉంటాయంటున్నారు. అలాగే అప్పటి బ్రిటిష్ పాలన టైములో కథ మొత్తం జరుగుతుంది కాబట్టి వారిని ఉద్దేశిస్తూ, బ్రిటిషర్ల‌రాజ్యంలో రామ – రావణుల్లాంటి మ‌నుషుల్ని ఇద్దరి యోధుల కథగా దీనిని రూపొందించారట. అందుకే ఫైనల్ గా ‘రామ రావణ రాజ్యం’ అనే టైటిల్ కి ఫిక్స్ అయ్యార‌ని స‌మాచారం. ఇక భార‌త‌దేశమంతా ఈ క‌థ గురించి తెలుసు కాబ‌ట్టి. అంటే రాముడు- రావ‌ణుడు గురించి తెలుసు కాబ‌ట్టి  మిగిలిన భాషల వారికి కూడా ఈజీగా అర్ధ‌మ‌వుతుంది. ఇక ఈ టైటిల్‌ని మార్చే అవ‌స‌రం ఉండ‌దంటున్నారు.

 

రామ్‌చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు మార్చి27న పుర‌స్క‌రించుకుని చ‌ర‌ణ్ ఫ‌స్ట్ లుక్‌తోపాటు టైటిల్ ఫుల్ ఫామ్ కూడా ఆ రోజే అనౌన్స్ చేసే అవ‌కాశాలు ఉన్నాయి. ఇక అలాగే ఈ సినిమాలో రాముడు ఎవ‌రు రావ‌ణుడు ఎవ‌రు అనే స‌స్పెన్స్ కూడా ఫ్యాన్స్‌కి వ‌దిలేశాడు రాజ‌మౌళి. 

మరింత సమాచారం తెలుసుకోండి: