తెలుగు చలన చిత్ర రంగంలో విలక్షణ నటుడుగా పేరు తెచ్చుకున్నారు ప్రకాశ్ రాజ్.  ఆయన ఎన్నో భాషల్లో తన నటనతో ప్రేక్షకుల మనసు గెల్చుకున్నారు.  కేవలం నటుడిగానే కాకుండా సామాజిక సేవా విషయంలో కూడా ముందు ఉంటున్నారు.  పలు గ్రామాలు దత్తత తీసుకొని వాటి అభివృద్ది కి కృషి చేస్తున్నారు.  కొంత కాలంగా ప్రకాశ్ రాజ్ రాజకీయాల్లోకి వెళ్లిన విషయం తెలిసిందే.  ఆ మద్య జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.   అయితే కొన్నిసార్లు ఆయన దూకుడు కి విమర్శల పాలైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ మద్య ప్రధాని నరేంద్ర మోదీపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రకాశ్ రాజ్. తాజాగా సింగర్ రాహూల్ సిప్లిగంజ్ విషయంలో ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

 

ఈ మద్య గచ్చిబౌలిలో సింగర్ రాహూల్ సిప్లిగంజ్ పై ఓ పబ్ లో కొంత మంది వ్యక్తులు బీరు బాటిల్స్ తో దాడి చేసన విషయం తెలిసిందే.  టాలీవుడ్ లో ప్రకంపణలు సృష్టించిన ఈ విషయంపై పలువురు జోక్యం చేసుకొని రాహూల్ సిప్లిగంజ్ కి మద్దతు పలికారు.  అయితే ఈ దాడిలో పాల్గొన్నది టీఆర్ఎస్ ఎమ్మెల్యే తమ్ముడు కావడంతో రాజకీయంగా ఈ సింగర్ పై వత్తిడి ఉంటుందని భాావించారు.  మరోవైపు రాహూల్ సిప్లిగంజ్ తనకు జరిగిన అన్యాయాన్ని సీపీ ఫుటేజ్ ని జోడిస్తూ మంత్రి కేటీఆర్ కి ఓ పోస్ట్ పెట్టారు.  తాజాగా రాహుల్ సిప్లిగంజ్ కు సినీ నటుడు ప్రకాశ్ రాజ్ మద్దతు పలికారు.

 

రాహుల్ తో కలిసి ఈరోజు టీఆర్ఎస్ నేత వినయ్ భాస్కర్ ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రాహుల్ కు ఎవరూ లేరని అనుకోవద్దని... తామంతా ఆయన వెనక ఉన్నామని చెప్పారు. రిలీఫ్ కోసం పబ్ కి వెళ్లినంత మాత్రాన కొట్టి చంపేస్తారా? అంటూ దాడి చేసిన వారిని ఉద్దేశించి ప్రశ్నించారు. జరిగిన గొడవలో రాహుల్ తప్పు లేదని... దాడి చేసిన వారికి శిక్ష పడాల్సిందేనని చెప్పారు. ఈ కేసు విషయంలో ఎవరితోనూ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: