భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తెలుగు సినిమాకి ఎంతో ప్రాధాన్యత ఉంది. తెలుగు ప్రేక్షకులు కొత్త సినిమా వస్తుంటే ఎంతో ఆసక్తి చూపిస్తారు. తమ అభిమానించే హీరోలను దైవం గా కొలుస్తారు. అంతేకాకుండ వారి నటించిన సినిమా వస్తుంటే ఫాన్స్ చేసే హడావిడి అంత ఇంత కాదు. సినిమా వారిని కుటుంబ సభ్యులుగా భావిస్తారు. వాళ్ళ హీరోలను ఎవరైనా ఏదైనా చిన్న కామెంట్ చేసిన ఊరుకోరు. ఘర్షణలకి దిగుతారు .ముఖ్య౦గా సోషల్ మీడియా వార్స్ తెల్సిందే. ఇంత వరకు బాగానే ఉన్నా సినిమా విషయానికి వస్తే సినిమా పట్ల ప్రేక్షుకుని ఆలోచన ధోరణి మారింది అనే చెప్పాలి.

 

ఒక్కపుడు తెలుగు సినిమాలు రాయలసీమ, ఫ్యాక్షనిస్టు, కుటుంబ తరహాలో సినిమాలు వచ్చేవి. అలాంటి జోనర్ సినిమాలకి ప్రేక్షకులు నీరాజనాలు పట్టేవారు. ముఖ్యంగా చిరంజీవి,బాలకృష్ణ సినిమాలకి మాస్ ఆడియన్స్ దగ్గరయ్యారు. ఇకపోతే నాగార్జున మన్మధుడు గా గుర్తింపు తెచ్చుకున్నారు. నాగార్జున సినిమా వస్తుంటే యూత్ లో మంచి క్రేజ్ ఉండేది. ఇక వెంకటేష్ సినిమాలు అయితే ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. వెంకటేష్ సినిమా అంటే కుటంబ సపరి వారి సమేతంగా ధియేటర్ కి వెళ్లేవారు. ఆ విధముగా ఒక దశబ్దం పాటు సినిమా ఇండస్ట్రీ ని తమ నటనతో ఏలారు.

 

ఇంతవరకు బాగానే ఉన్న ఇప్పుడు ప్రేక్షకుడి ఆలోచన ధోరణి మారింది. ఉరుకులు ,పరుగులు జీవితం ధియేటర్ కి వెళ్లి సినిమా చూసే అంత టైం ఉండటంలేదు అంతకు మించి రొటీన్ మూవీస్ చూడటానికి ఇంట్రస్ట్ చూపించడాం లేదు. కారణం సినిమాలో కథ లేకపోవడం అనే చెప్పొచ్చు సినిమాలో ఆరు పాటలు ,నాలుగు ఫైట్లు ,హీరో,హీరోయిన్ వచ్చి రాని నటన, దర్శకత్వ లోపం. తెలుగు ప్రేక్షకులు ఇలాంటి సినిమాలను పక్కనే పెట్టేసారు అని చెప్పొచ్చు. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇలాంటి జోనర్ లో ఎంత చిన్న సినిమా అయినా బాక్సఫీస్ వద్ద హిట్ గా నిలుస్తుంది. దీని బట్టి చూస్తే ప్రేక్షకుడు కొత్తదనం కోరుకుంటున్నాడు అనే చెప్పాలి. సినిమా బాగుంటేనే ఆదరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: