‘అల వైకుంఠపురములో’ అనగానే అందరికి గుర్తొచ్చేది అందులోని పాటలే. అల్లు అర్జున్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన  మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో మన అందరికి విదితమే. ఇక ఈ సినిమా విడుదలకు ముందే ఆల్బమ్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ ఆల్బం తో  సంగీత దర్శకుడు తమన్ దశ, దిశ మారిందనే చెప్పాలి. ఈ పాటలు అతనికి కాపీ కేట్ అనే ముద్రను తొలిగి పోయిందంటే మీరు ఊహించుకోవాలి.

 

మెలోడీ పరంగా ‘సామజవరగమన’ పాపులర్ అయితే.. ‘రాములో రాములా’ ఫోక్ సాంగ్, మాస్ ప్రేక్షకులను  అలరించింది. తెలంగాణ యాసలో అనురాగ్ కులకర్ణి పాడిన ఈ పాటను, ఇప్పుడు ప్రముఖ ర్యాప్ బాలీవుడ్ సింగర్ బాబా సెహగల్ పాడారు. తనదైన స్టైల్లో బాబా సెహగల్ ఆలపించిన రాములో రాములా పాటను ఆదిత్య మ్యూజిక్ సంస్థ తమ యూట్యూబ్ ఛానెల్‌లో కొద్ది సేపటి క్రితమే అప్‌లోడ్ చేసింది. అయితే, ఈ పాటపై వివిధ విమర్శలు గుప్పిస్తున్నారు తెలుగు అభిమానులు. 

 

ఒక అద్భుతమైన పాటను బాబా సెహగల్ కూనీ చేసేశారంటూ సంగీత ప్రియులు లబో దిబో అంటున్నారు. బాబా సెహగల్‌ను యుట్యూబ్ లో తెగ ట్రోల్ చేస్తున్నారు. నిజానికి ఈ పాటలోని పదాలను బాబా సెహగల్ నత్తి నత్తిగా పలకడం వలన దాన్ని కాస్త కామెడీ చేసినట్టు అయింది. అచ్చతెలుగు తెలంగాణ మాండలిక పదాలు అవడం వలన అతనికి నోరు సరిగ్గా తిరగలేదు. అక్కడే ఈ సమస్య వచ్చింది. అయితే అతను ఈ పాటను సెలెక్ట్ చేసుకోకుండా ఉండాల్సింది. బొత్తిగా అతనికి సూటవ్వని పాట ఆదిత్య అతనితో బలంగా పాడించిందేమో అన్న అనుమానం మనకు కలగక మానదు.

 

బహుశా, బాబా పాపులర్ సింగర్ కావడం చేత, సదరు మ్యూజిక్ అకాడమీ అతనితో పాడించి క్యాష్ చేసుకోవాలని అనుకుందా అనే అనుమానం కలగక మానదు. కానీ, వారి ప్రయత్నం వృధా ప్రయాస అయ్యింది. నిజానికి బాబా సెహగల్ మంచి ర్యాప్ సింగర్. ఆయన తెలుగులో పాడిన ‘రూపు తేరా మస్తానా’ సాంగ్‌తో మంచి పేరు సంపాదించుకున్నారు. ఆ తరవాత ‘జల్సా’లోని టైటిల్ సాంగ్‌తో బాబా పాపులర్ అయ్యారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: