టాలీవుడ్ లో ఎంతో మంది హీరోలు అనుకోకుండా వెలుగులోకి వచ్చారు..  అనూహ్యంగా కనుమరుగయ్యారు.  అలాంటి హీరోల్లో ఒకరు  'శ్రీ సీతారాముల కల్యాణము చూతము రారండి' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన వెంకట్, తొలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.  హీరోగా మంచి హైట్ పర్సనాలిటీ ఉన్న వెంకట్ తర్వాత సైడ్ క్యారెక్టర్స్ కి మాత్రమే పరిమితం అయ్యాడు. తొలి సినిమాతో ఎంత మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ వెంకట్ కి మాత్రం సినీ పరిశ్రమలో పెద్దగా పేరు రాలేదు.  ఆ సమయంలో మరికొంత మంది హీరోలు వెలుగు లోకి వచ్చారు.  ఇక స్టార్ హీరోల వారసులు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇలాంటి హీరోలు పూర్తిగా కనుమరుగయ్యారు.

 

అయితే తాను ఎందుకు సినిమాల్లో ఎక్కువ కాలం ఉండలేక పోయానో అన్న విషయంపై హీరో వెంకట్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఆయన మాటలు వింటుంటే ఎవరికైనా బాధ కలగడం ఖాయం.  ఓ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించానని.. ఆ సమయంలో ఫైట్ సీన్ సహజంగా ఉండాలన్న తాపత్రయంతో ఎలాంటి డూప్ లేకుండా ట్రై చేశానని.... ఆ సమయంలో నా వెన్నుముఖ దెబ్బతిన్నదని అన్నారు.  అయితే ఈ విషయం అప్పుడు ప్రస్తావిస్తే షూటింగ్ వాయిదా పడిపోతుందన్న భయంతో చెప్పకుండా మనసులో దాచి చిన్న గాయం అని షూటింగ్ ఎలాగో అలా పూర్తి చేశాను.  

 

దాని పరిణామం చాలా తీవ్రంగా పడిందని .. ఏకంగా మూడు నాలుగు నెలల మంచానికే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఆ గాయం బాధ పెడుతుండటం వలన నేను ఎక్కువ సినిమాలు చేయలేకపోయాను. ఇక పారితోషికం మరీ తక్కువగా ఇస్తామని చెప్పడం వలన కూడా కొన్ని అవకాశాలను వదులుకోవలసి వచ్చింది అని చెప్పుకొచ్చాడు.  వెండితెరపై వెలిగిపోవాలని ఎన్ని కలలతో వచ్చినప్పటికీ అదృష్ట కూడా సహకరించాలని అంటుంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: