ఒకప్పుడు బి గ్రేడ్ బ్లూ ఫిలిమ్స్ లో నటించిన దొరబాబు.. జబర్దస్త్ లోకి వచ్చిన తర్వాత ఎంతో పేరు సంపాదించాడు. తనదైన స్టైల్ కామెడీ చేస్తూ... బుల్లితెర ప్రేక్షకులందరికీ సుపరిచితుడిగా  మారిపోయాడు జబర్దస్త్ కమెడియన్ దొరబాబు. అయితే తాజాగా విశాఖపట్నంలోని ఒక భవనంలో వ్యభిచారం జరుగుతుందని సమాచారం అందుకున్న పోలీసులు... రైడ్  నిర్వహించడంతో జబర్దస్త్ దొరబాబు పరదేశీలు పట్టుబడిన విషయం తెలిసిందే. అయితే జబర్దస్త్ లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వీరిద్దరూ వ్యభిచారం లో పట్టుబడడంతో  ఒక్కసారిగా సంచలనం గా మారిపోయింది. అంతే కాకుండా పట్టుబడిన ఇద్దరు జబర్దస్త్ నటులు  పోలీసులను మమ్మల్ని వదిలేయాలని మా కెరీర్ పాడైపోతుంది అంటూ వేడుకుంటున్న వీడియో కూడా బయటికి రావడం మరింత సంచలనం సృష్టించింది. 

 

 

 గత రెండు మూడు రోజులపాటు... దొరబాబు పరదేశి  లు  దొరికిన వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే తన భర్త దొరబాబు పై వస్తున్న వార్తలను ఖండించింది దొరబాబు భార్య. దొరబాబు కు అండగా నిలిచింది. నెల్లూరు లోకల్ టీవీ యాంకర్ అమూల్య ను  ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు దొరబాబు. వీళ్ళ ప్రేమకు గుర్తుగా ఒక కూతురు కూడా ఉంది. మంచి భార్య కూతురు ని పెట్టుకుని వ్యభిచారం  చేయడం ఏమిటి అని చాలా మంది ఇప్పటికే దొరబాబుకి  క్లాస్ పీకుతూనే  ఉన్నారు. దీంతో విమర్శకులు అందరికీ ఘాటుగా సమాధానం ఇస్తూ దొరబాబు కు అండగా నిలిచింది భార్య అమూల్య. అంతే కాదు దొరబాబు భార్య అమూల్యకు  టిక్ టాక్ లో కూడా చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. 

 

 

 దొరబాబు వ్యాణిచారం  కేసులో పట్టుబడిన తరువాత తన మనసులో ఏముంది అనే విషయాన్ని బయటకు చెప్పేసింది అమూల్య. ఓ వ్యక్తిని అపార్ధం చేసుకున్నప్పుడు.. గతంలో ఆయన మనతో ఎలా ఉన్నాడు అనేది మర్చిపోకూడదు. కొన్నిసార్లు మన కళ్ళు మనల్ని మోసం చేస్తూ ఉంటాయి. మన కళ్ళని మనమే నమ్మలేము అంటూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టింది దొరబాబు భార్య అమూల్య. దీన్ని బట్టి తన భర్తను పూర్తిగా నమ్ముతున్నానని... అండగా ఉంటాను అంటూ చెప్పకనే చెప్పింది. అంతేకాదు తన మొగుడి గురించి తనకు పూర్తిగా తెలుసునని.. ఎన్ని ఆరోపణలు వచ్చినా నేను నమ్మను అంటూ చెప్పకనే చెప్పింది దొరబాబు భార్య అమూల్య.

మరింత సమాచారం తెలుసుకోండి: