కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఎంత క్రేజ్ పాపులారిటీ ఉందో.. టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవికి అంతే క్రేజ్ పాపులారిటీ ఉంది. ఇది ఎవరూ కాదనలేని సత్యం. ఇద్దరూ ఇనిస్టిట్యూట్ విద్యార్ధులే. మొదట్లో విలన్ వేషాలు వేసిన వారే. హీరోలుగా ఒక్కో మెట్టు ఎక్కి నెంబర్ వన్ హీరోలుగా మూడు దశాబ్దాలకు పైగా రెండు ఇండస్ట్రీలను ఏలుతున్న వారే. వయసు పెరుగుతున్నా తగ్గని ఎనర్జీ వారిద్దరిదీ. అయితే.. ఈమధ్య సోషల్ మీడియాలో చిరంజీవిపై ట్రోలింగ్ ఎక్కువవుతోంది. దీనికి మెగా ఫ్యాన్స్ ధీటుగా స్పందిస్తున్నారు.

 

 

చిరంజీవికి వయసు 64 కాబట్టి ఇక సపోర్టింగ్ రోల్స్ చేయాలని వాదిస్తున్నారు కొందరు యాంటీ ఫ్యాన్స్. దీంతో మెగా అభిమానులు తీవ్రంగా రెస్పాండ్ అవుతున్నారు. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ 70ఏళ్ల వయసులో హీరోగా వరుస సినిమాలు చేస్తున్నప్పుడు 64లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఎందుకు హీరోగా సినిమాలు చేయకూడదని స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. పైగా.. పదేళ్లుగా రజినీ తన మార్క్ హిట్ ఇవ్వకుండా వరుస ఫ్లాపులు చూస్తున్నా సినిమాలు చేస్తున్నాడు. చిరంజీవి పదేళ్ల గ్యాప్ తర్వాత వచ్చి కూడా చేసిన రెండు సినిమాలను 100 కోట్ల క్లబ్ లోకి చేర్చాడు.

 

 

సూపర్ స్టార్ కంటే మెగాస్టార్ ట్రాక్ రికార్డు బాగున్నప్పుడు చిరంజీవి హీరోగా ఎందుకు చేయకూడదని కౌంటర్ ఇస్తున్నారు. మెగాభిమానుల వాదన వంద శాతం నిజమైనదే. చిరంజీవి సమకాలీకులు ఎవరూ కూడా కనీసం 50కోట్ల క్లబ్ లోకి ఎంటర్ కాలేకపోతున్నారు. చిరంజీవి మాత్రం వరుసగా రెండు సినిమాలను భారీ బ్లాక్ బస్టర్స్ చేసుకున్నాడు. పైగా పదేళ్ల గ్యాప్ తర్వాత కూడా చిరంజీవి అదే గ్రేస్, గ్లామర్ మెయింటైన్ చేయడం విశేషం. కాబట్టి యాంటీ ఫ్యాన్స్ చేసే వాదనలను మెగా ఫ్యాన్స్ పట్టించుకోనవసరం లేదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: