బుల్లితరపై నటుడిగా ప్రస్థానం మొదలు పెట్టిన రాజా రవీంద్ర తర్వాత వెండితెరపై నటుడిగా తన సత్తా చాటారు.  చిన్న చిన్న పాత్రల్లో నటించిన ఆయన తర్వాత విలన్, క్యారెక్టర్ పాత్రల్లో నటించారు.  రాజా రవీంద్ర  నటుడు మాత్రమే కాదు, అనేకమంది అగ్రహీరోలకు, నటులకు డేట్లు చూసే మేనేజర్ కూడా.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కెరీర్ బిగినింగ్ లో ఎన్నో ఇబ్బందులు పడుతూ పైకి వచ్చానని అన్నారు.  తన జీవితంలో స్ఫూర్తిగా నిలిచే అతి కొద్దిమందిలో ప్రకాశ్ రాజ్ ఒకరని తెలిపారు. నేను ఎంతో మంది హీరోలకు, నటులకు డేట్స్ చూస్తూ మేనేజర్ గా వ్యవహరించానని.. కానీ ఎప్పుడూ ప్రకాశ్ రాజ్ డేట్లు చూడలేదని.. కేవలం ఆయనతో మంచి పరిచయం మాత్రమే ఉందన అన్నారు. 

 

నా కూతురు వివాహం చేసే సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయని.. ఆ విషయం తెలుసుకొని ఆయన పిలిపించుకొని మరీ ఆదుకున్నారని అన్నారు.  ఇప్పటి వరకు తాను ఇచ్చిన డబ్బు ప్రస్తావన తీసుకు రాలేదని అన్నారు.  అంత గొప్ప మనసు ఉన్న మనిషి ప్రకాశ్ రాజ్ అన్నారు.  ప్రకాశ్ రాజ్ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పడానికి ఇంతకంటే సరైన ఉదాహరణ ఇంకేం ఉంటుందని అన్నారు.  ఓ పేరుమోసిన నటుడు ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకునే స్థితిలో ఉంటే ప్రకాశ్ రాజే దేవుడిలా కాపాడారు. 

 

ఆయన ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకొని ఎందుకు అన్ని ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని అతడు అంత ఘోరమైన పొజీషన్లో ఉన్నాడా అని నా ద్వారా తెలుసకొని నా దగ్గరికి తీసుకురా అన్నారు. నేను ఆ నటుడ్ని తీసుకుని ప్రకాశ్ రాజ్ వద్దకు తీసుకెళ్లాను.  నీ అప్పులు ఎంత ఉంటాయని అడిగారు.. తనకు రూ.50 లక్షల వరకు అప్పులు ఉన్నాయని తెలుసుకొని ఆ డబ్బు ఇచ్చి అతని జీవితాన్ని నిలిపారని అన్నారు.  కొంత మంది గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే..అలాంటి వారిలో ప్రకాశ్ రాజ్ ఒకరు అని అన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: