తెలుగు సినిమాల్లో హీరో హీరోయిన్ మధ్య ఉండే పాటలు ఒక ఎత్తు అయితే,  ఐటమ్ సాంగ్ కి ఉండే ప్రత్యేకత మరో ఎత్తు..  ఆ ఐటమ్ సాంగ్స్ పాట వస్తే కుర్రకారు ఉషారెత్తిపోతారు. సినిమా హాల్లో ఒక్కటే గోల, ఈలలు, అరుపులు మాములుగా ఉండదు... తెలుగు సినిమాల్లో ఐటెం సాంగ్స్ కి ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది. దాదాపు కొన్ని సినిమాలను వాటికోసమే చూసేవారు చాలా మంది ఉంటారు. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ లో స్టార్ హీరోయిన్స్ సైతం ఐటెం సాంగ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు. 

 


సినిమాల్లో హీరోయిన్ గా నటించిన వచ్చే పేరు వేరు, ఐటమ్ సాంగ్ లో నటిస్తే వచ్చే క్రెజ్ వేరు..ఒకప్పుడు ఐటమ్ సాంగ్స్ కి ప్రత్యేకంగా ఆర్టిస్ట్స్ ఉండేవారు. కానీ ఇప్పుడు హీరోయిన్స్ కూడా  ఐటమ్ సాంగ్స్ చేస్తున్నారు.. ఒక పక్క  హీరోయిన్ గా మరో పక్క ఐటమ్ గర్ల్ గా రాణిస్తున్నారు.. తమన్నా, సమంతా, కాజల్, పూజా హెగ్డే, పాయల్, శ్రీజ వారంతా ఐటెం సాంగ్స్ తో అభిమానులను ఉర్రూతలూగిస్తున్నారు.

 


ఇప్పుడు ఉన్న ట్రెండ్ లో టాలీవుడ్ లో కాకరేపాలంటే మసాలా సాంగ్ ఉండాలిసిందే.. కుర్రాళ్ళని రెచ్చగోట్టాలంటే  ఐటమ్ సాంగ్స్ ఉండాలిసిందే. ఐటమ్ సాంగ్ వస్తే చాలు కుర్రాళ్ళు రెచ్చిపోతారుగా! ఆ హీరోయిన్ ఎక్సప్రెషన్, వేషధారణ, ఎక్సపోసింగ్, మ్యూజిక్ అన్ని కలిసి సినిమా హాల్లో సీట్లో కుర్చోనివ్వవు.. అంతా క్రెజ్ ఉండబట్టే ప్రతి సినిమాల్లో ఐటమ్ సాంగ్ పెడుతున్నారు..  స్టార్ హీరోతో ఐటమ్ సాంగ్  అంటే క్రేజ్ మాములుగా ఉండదు కదా అందుకే హీరోయిన్స్ కూడా ఒకే చెప్పేస్తున్నారు..  టాలీవుడ్ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ అనేవి కామన్ అయిపోయాయి. కొన్ని సినిమాల్లో అవసరం ఉన్నా లేకపోయినా ఐటెం సాంగ్ మాత్రం పెట్టేస్తున్నారు.

 


 ఒకప్పుడు ఈ సాంగ్స్ కోసం బాలీవుడ్ నుండి ఇతర రాష్ట్రాల నుండి అమ్మాయిలను తీసుకొని డాన్స్ లు చేయించేవారు. కానీ ఇప్పుడు మన హీరోయిన్లే ఐటెం సాంగ్స్ లో మెరిసిపోతున్నారు. వాటి కోసం కోట్లలో రెమ్యునరేషన్ కూడా అందుకుంటున్నారు. సినిమాకు కూడా మంచి హైప్ వస్తోంది. అందుకే  ప్రతి సినిమాల్లో ఐటమ్ సాంగ్ మెరుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: