కార్తీకదీపం.. బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. ప్ర‌ముఖ స్టార్ మా ఛానల్ లో ప్రసారమయే కార్తీక దీపం సీరియల్ అంటే పిల్ల‌ల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు విప‌రీతంగా ఇష్ట‌ప‌డ‌తారు. ఈ  సీరియల్ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఏకంగా మన దేశపు టీఆర్పీ రేటింగ్స్ లోనే ఒక సంచలనం అని చెప్పాలి. ఆ రేంజ్ లో ఈ సీరియల్ ను ఆదరిస్తున్నారు. ముఖ్యంగా ఈ సీరియ‌ల్‌లో వంట‌ల‌క్క అలియాస్ దీప అలియాస్ ప్రేమి విశ్వ‌నాథ్‌ అంటే బుల్లితెర ప్రేక్ష‌కులకు ఎంత‌గానో అభిమానం.

 

టీవీలో ఈ స్టార్ల సినిమాలు పాతవి వచ్చినా పిచ్చ పిచ్చగా చూసే ప్రేక్షకులు.. ఇప్పుడు మాత్రం కొత్త సినిమాలు వచ్చినా పెద్దగా స్పందించడం లేదు. ఆ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. దీనికి కారణం కార్తీకదీపం సీరియల్. అలాగే ఏ హీరోయిన్‌కి లేనంగా ఫ్యాన్ ఫాలోంగ్ కార్తీక‌దీపం వంట‌ల‌క్క‌కు ఉన్నారంటే అతిశ‌యోక్తి కాదు. మ‌రి కార్తీక‌దీపంలో వంట‌ల‌క్క చ‌నిపోయిందా అంటే.. తాజా ఎపిసోడ్ ప్ర‌కారం అలాంటి అనుమానాలే వ్య‌క్తం అవుతున్నాయి. ఎందుకంటే ఇప్ప‌టికే దీప సీరియ‌ల్‌లో క‌నిపించ‌డం లేదు. దీంతో సౌర్య ఎవరూ చూడకుండా వారణాసి ఆటోలో పోలీస్ స్టేషన్‌కి వెళ్లి  కంప్లైంట్  ఇద్దామ‌నుకుంటుంది. 

 

అయితే ఇంత‌లోనే ఓ కానిస్టేబుల్ పరుగున వచ్చి ఎవరో ఒక ఆడమనిషిని లారీ గుద్దేసింది.. పాపం చనిపోయింది సార్.. అని చెప్పడంతో సౌర్య కంగారు మరింత పెరిగిపోతుంది. దీంతో ఎస్సై.. మీ అమ్మ ఎలా ఉంటుంద‌ని సౌర్యను అడ‌గ‌గా.. సమాధానం చెబుతుంది. దీంతో  ఆ కానిస్టేబుల్.. సార్ ఇంచుమించు అన్నీ మ్యాచ్ అవుతున్నాయి అంటాడు. వెంట‌నే సౌర్య ఆమెను చూడాలంటుంది. కానీ, అందుకు పోలీసులు నిరాక‌రించి.. మీ నాన్న తీసుకురామ‌ని చెబుతారు. దీంతో ఏడ్చుకుంటూ వ‌చ్చిన సౌర్య‌కు దారిలో కార్తీక్ క‌నిపించ‌డంతో విష‌యం చెబుతుంది. 

 

ఈ క్ర‌మంలోనే నువ్వే నా నాన్న అన్న నిజం కూడా చేప్పేస్తుంది. ఇవాళ ఒక్కసారి నువ్వే మా నాన్నవని ఇంకెప్పుడూ నిన్ను నాన్న అని పిలవను.. ప్లీజ్ నాన్నా.. పోలీసులకు ద‌గ్గ‌ర‌కు రా.. నాన్న అంటూ వేడుకుంటుంది. అది చూడలేక కార్తీక్ బాధగా అందుకు ఒప్పుకుని పోలీసుల‌కు తీసుకువెళ్తుడు. అక్క‌డ మార్చురీ దగ్గరకు వెళ్లి సౌర్య‌ను బ‌య‌ట ఉంచి.. కార్తీక్ లోప‌ల‌కి వెళ్తుడు. ఈ క్ర‌మంలోనే కార్తీక్ భయంతో, బాధగా సంకోచిస్తూ.. కళ్లనిండా నీళ్లతో.. శవం మీద ఉన్న గుడ్డని తీసి చూస్తాడు. అచ్చం దీపలానే నుదుటి మీద కుంకుమ కనిపిస్తుంది. అక్క‌డితో ఎపిసోడ్ అయిపోయింది. దీంతో చ‌నిపోయింది దీపేనా..? లేదా మ‌రెవ‌రైనానా..? అన్న‌ది స‌స్పెన్స్‌లో పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: