టాలీవుడ్ లెజెండరీ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి తొలి సినిమా పునాది రాళ్లు నుండి మొన్నటి సైరా నరసింహారెడ్డి వరకు, తన కెరీర్ లో చేసిన ప్రతి ఒక్క సినిమాతో నటుడిగా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఎంతో గొప్ప పేరు గడించారు. ముందుగా అక్కడక్కడా కొన్ని సినిమాల్లో విలన్ క్యారెక్టర్స్ లో కూడా నటించిన చిరంజీవి, ఆ తరువాత తన యాక్టింగ్, డ్యాన్సింగ్ టాలెంట్ తో అప్పటి యువతలో సూపర్ క్రేజ్ సంపాదించి సుప్రీం హీరోగా పేరు గడించారు. ఆపై మెల్లగా ఒక్కొక్క సినిమాతో సూపర్ హిట్ కొడుతూ ముందుకు సాగిన చిరంజీవి, ఆపై ఎంతో క్రేజ్, విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తో మెగాస్టార్ బిరుదును దక్కించుకున్నారు. ఎంత ఎదిగినా ఎప్పుడూ కూడా ఎంతో ఒదిగి ఉండే మెగాస్టార్ చిరంజీవి, తన సినిమాల్లో పని చేసి ప్రతిఒక్కరిని ఎంతో సాదరంగా పలకరించడం, ముఖ్యంగా హీరోయిన్స్ కి అయితే ఎంతో బాగా విలువనిస్తారని టాలీవుడ్ లో మంచి పేరుంది. 

 

ఇక చాలామంది హీరోయిన్స్ కు హాట్ ఫేవరెట్ అయిన మెగాస్టార్ తో ఒక్క సినిమా అయినా చేయాలని నేటి తరం యంగ్ హీరోయిన్స్  సైతం పోటీ పడుతుంటారు అంటే ఆయన చరిష్మా, క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇకపోతే మెగాస్టార్ ని ఎంతో ఇష్టపడే హీరోయిన్స్ లో బాలీవుడ్ హీరోయిన్ రేఖ కూడా ఒకరు. ఇక పలు సందర్భాల్లో మెగాస్టార్ పై తన అభిమానాన్ని ఎంతో గొప్పగా చెప్పిన రేఖ, ఆ మధ్య జరిగిన ఒక వేడుకలో మాట్లాడుతూ, నేను చిరంజీవి గారికి ఎంతో పెద్ద ఫ్యాన్ ని అనే విషయం ఆయనకు కూడా తెలుసు. నన్ను కలిసిన ప్రతిసారి, మీరు చాలా గ్రేట్, నేటి హీరోయిన్స్ మిమ్మల్ని చూసి ఎంతో నేర్చుకోవాలి, 

 

అలానే ఎంత ఏజ్ పెరిగినా ఇప్పటికీ అదే విధమైన గ్లామర్ మెయింటెయిన్ చేస్తున్నారు, ఆ సీక్రెట్ ఎంతో మాకు కూడా చెప్పండి అని అడుగుతుంటారు తప్ప, తన సినిమాలో నేను ఎన్ని సార్లు అడిగినా హీరోయిన్ గా ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు, ఆయన ఈ విధంగా చేస్తారనుకోలేదు అంటూ ఆమె సరదాగా చెప్పడం జరిగింది. ఆమె మాటలతో చిరంజీవి సహా పక్కన ఉన్నవారందరూ కూడా పక్కున నవ్వడం జరిగింది. అయితే అప్పట్లో ఓవైపు మెగాస్టార్ ఎంతో బిజీ షెడ్యూల్ తో సినిమాలు చేస్తుండడం, మరోవైపు అటు బాలీవుడ్ లో రేఖ కూడా బిజీ కావడంతో వారిద్దరికీ స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం ఒక్కటి కూడా రాలేదని, కాగా రేఖ మాత్రమే కాదు, అప్పట్లో ఆయన ప్రక్కన నటించే ఛాన్స్ లేని చాలామంది హీరోయిన్స్  ఆవేదన కూడా కూడా ఇదేనని అంటున్నారు సినీ విశ్లేషకులు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: