వెంకటాద్రి ఎక్ష్ప్రెస్స్ సినిమా ద్వారా తెలుగు  పరిచయమైనా హీరో సందీప్ కిషన.. తెలుగు సినిమాలలో అడపాదపా సినిమాలలో నటించారు.ఆ సినిమా ఒక్కటి తప్ప మారె సినిమా సందీప్ కు  హిట్ని  అందించలేక పోయాయి. అయితే ఇప్పుడు ఓ కొత్త    సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది. ఎన్ని చేస్తే ఎం లాభం లెండి.. సినిమాలో ఎడారిలో నీరులాగా మారాయి.. 


`

 

ఏ1 ఎక్స్ ప్రెస్` అంటూ క్రీడా నేపథ్యం ఉన్న కాన్సెప్ట్ ని ఎంచుకున్నాడు. మరి ఈ సినిమా సీనేమిటి? అన్నది ఇప్పటికి సస్పెన్స్. హాకీ నేపథ్యంలో తెరకెక్కుతున్న `ఏ1 ఎక్స్ ప్రెస్` తనకో బిగ్ బ్రేక్ ఇస్తుందని సందీప్ ఆశిస్తున్నాడు. ఇందులో అతడు హాకీ ప్లేయర్ గా కనపించనున్నాడు. ఈ పాత్ర కోసం కొన్ని నెలల పాటు హాకీ ట్రైనింగ్ తీసుకున్నాడు. క్రీడాకారుని పాత్రకు అవసరమైన అహర్యం కోసం నిరంతరం శ్రమిస్తూ కమిట్ మెంట్ తో ఉన్నాడట. 

 

 


ఈ సినిమాలో హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి నటిస్తోంది.అయితే ఈ సినిమా ప్రచారంలో భాగంగా యూనిట్ లావణ్య పైనే ఫోకస్ పెట్టి ప్రమోట్ చేస్తుండడం వేడెక్కిస్తోంది.సోషల్ మీడియా అంతటా లావణ్య మయం అయిపోయింది. ఇంతకీ సందీప్ ఏమయ్యాడు? అన్నంతగా అమ్మడి పేరు మార్మోగుతోంది. మరి ఈ సీన్ చూస్తుంటే సందీప్ కావాలనే ప్రచారానికి దూరంగా ఉన్నాడా? లేక ఇంకేదైనా కారణం వల్ల స్కిప్ కొడుతున్నాడా? అన్నది తెలియాల్సి ఉంది. 

 

 

 

అయితే ఇక్కడ.. కారణాలు ఏవైనా వరుస ప్లాపుల్లో ఉన్న సందీప్ మాత్రం ఇప్పుడు కొత్త కథతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు.. మరి ఈ సినిమా అబ్బాయి గారికి ఏ మాత్రం హిట్ ని అందిస్తుందో చూడాలి.. మొత్తానికి ఇన్ని రోజులకు ఓ సినిమాలో నటిస్తున్నాడు. అది కూడా క్రీడా నేపథ్యంలో మరి ఈ సినిమా ఏ విదంగా సందీప్ సినిమా కెరియర్ కు పునాదిని వేస్తుందో తెలియాలంటే కొద్దీ రోజులు ఆగాల్సిందే.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: