టాలీవుడ్ మాటల మాంత్రికుడిగా పేరుగాంచిన త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఒక మంచి పేరుంది అనే చెప్పాలి. తొలిసారిగా వేణు తొట్టెంపూడి, లయ ల కలయికలో వచ్చిన స్వయంవరం సినిమాకు కథ, మాటలు అందించి తనలోని డిఫరెంట్ టాలెంట్ ని నిరూపించుకున్న త్రివిక్రమ్, ఆ తరువాత కూడా పలు సక్సెస్ఫుల్ సినిమాలకు మాటలు అందించి మాటల మాంత్రికుడిగా పేరు గడించారు. ఇక ఆ తరువాత తరుణ్, శ్రియ ల కాంబోలో వచ్చిన నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా మారిన త్రివిక్రమ్, ఆ తరువాత అతడు, జల్సా, జులాయి, అత్తారింటికి దారేది, సన్ ఆఫ్ సత్యమూర్తి, అఆ, అలవైకుంఠపురములో, అరవింద సమేత వంటి సూపర్ హిట్స్ తో పాటు మధ్యలో కొన్ని ఫ్లాప్స్ కూడా అందుకున్నారు. 

 

ఇక అతి త్వరలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా హారిక హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు కలిసి నిర్మించనున్న సినిమాకు  దర్శకత్వం వహించనున్నారు త్రివిక్రమ్. అయినను పోయి రావలె హస్తినకు అనే టైటిల్ తో ఆ సినిమా తెరకెక్కనుందని, నేటి రాజకీయ ముఖ చిత్రాన్ని ఆవిష్కరించే రీతిలో కొంత వ్యంగ్యంగా పలు ఎంటర్టైన్మెంట్ అంశాలతో ఆ సినిమా తెరకెక్కనున్నట్లు టాక్. అయితే ప్రస్తుతం ఆ సినిమాపై కొందరు నెటిజన్లు తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఇదివరకు ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ తీసిన అరవింద్ సమేత సినిమా సక్సెస్ సాధించినప్పటికీ, 

 

ఒకరకంగా ఆ సినిమాలో చాలా వరకు త్రివిక్రమ్ మార్క్ ఎంటర్టైన్మెంట్, పంచ్ డైలాగ్స్ వంటివి మిస్ అయ్యాయని, అలానే కొంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి  ఆ సినిమా నచ్చలేదని, అసలు ఇది త్రివిక్రమ్ సినిమానేనా అంటూ ప్రేక్షకులు బహిరంగంగానే పెదవి విరిచారని గుర్తుచేస్తున్నారు. మరి నెక్స్ట్ ఎన్టీఆర్ తో ఆయన చేసే సినిమా కూడా అలానే ఉంటుందేమో అన్న అనుమానం కలుగుతోందని, అందరూ మిమ్మల్ని గురూజీ గురూజీ అని గౌరవంగా పిలుస్తూ, మీ డైరెక్షన్ ని ఎంతో గొప్పగా భావిస్తుంటే, మీరు మాత్రం తదుపరి చేయబోయే సినిమాతో మరోసారి ఎన్టీఆర్ గుండెల మీద తన్నరు కదా అంటూ వాపోతూ కామెంట్స్ చేస్తున్నారట......!!

మరింత సమాచారం తెలుసుకోండి: