చిత్ర పరిశ్రమలో ఎదగాలనుకుంటే ఎలాంటి సన్నివేశాల్లోనైనా నటించాల్సిందే. మన తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలు తప్పించి మిగతా అంటే బాలీవుడ్, హాలీవుడ్ లో హీరోయిన్స్ ని నగ్నంగా చూపించాలని తాపత్రయపడుతుంటారు మేకర్స్. అందుకే ఒక్కోసారి హీరో హీరోయిన్స్ తెరముందు నగ్నంగా నిలబడాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతుంది. అలాంటి సినిమాలకి అభ్యంతరం చెబితే ఎక్కడ సినిమాలలో ఛాన్స్ ఇవ్వరో అని ఎక్కువగా హీరోయిన్స్ భయపడుతుంటారు. కొన్ని సార్లు డూప్ ఉంటుందని చెప్పి కూడా ఆ తర్వాత మీ ఫిజిక్ కి తగ్గ డూప్ దొరకలేదని ..ఇది యాక్టింగే కదా మీరే చేసేయండి అంటూ బలవంతంగా కమిట్  చేయిస్తుంటారు. ఒకరకంగా ఇది మేకర్స్ స్ట్రాటజీ కూడా.

 

అయితే ఇండస్ట్రీలో ఓ స్థాయికి వచ్చాక కూడా ఇలాంటి సన్నివేశాల్లో నటించాలంటే కొందరు ఒప్పుకోరు. పేరు తెచ్చుకున్నాక కూడా అలాంటి పాత్రల్లో నటిస్తే పరువు పోతుందని వెనకడు వేస్తుంటారు. అంతేకాదు ఈ మధ్యకాలంలో అలాంటి నగ్న సన్నివేశాలను కట్ చేసి పోర్న్ సైట్లలో పెట్టేస్తున్నారు. ఇదే పరిస్థితి ప్రముఖ హాలీవుడ్ నటి కీరా నైట్లేకి ఎదురైందని వాపోతుంది.

 

ఇప్పుడు ఈ హీరోయిన్ వయసు 30 ఏళ్ళు. ఇద్దరు పిల్లలకు తల్లి కూడా. అయినా కూడా నగ్న సన్నివేశాల్లో నటించాలని దర్శకులు ఇబ్బంది పెడుతున్నారట. అందుకే ఏదన్నా సినిమాకు సంతకం చేసేముందు తన కాంట్రాక్ట్‌లో నో న్యూడిటీ క్లాజ్‌ అని రాయించుకుని మరీ సంతకం చేయించుకుంటున్నారట. ఈ విషయాన్ని కీరా నిర్మొహమాటంగా బయటపెట్టింది. మేకర్స్ కోరినట్టు అందరి ముందు నిలబడి నా బాడీని నేను ప్రదర్శించలేను. ఇంతకముందు నగ్న సన్నివేశాల్లో నటించిన మాట వాస్తవం. అప్పట్లో నాకు ఎలాంటి సమస్య ఉండేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి సీన్లలో నటించలేను. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నా వయసు 30. ఇప్పుడు కూడా అలాంటి సన్నివేశాల్లో నటిస్తే వాటిని పోర్న్ సైట్స్‌లో పెట్టేస్తున్నారు. దాంతో నన్ను పోర్న్‌స్టార్ అనుకుంటారు. అందుకే సినిమాకి ఒప్పుకేనే ముందు ఈ కండీషన్స్ తో ఒప్పుకుంటాను అంటోంది. 

 

ఇక ఈ మధ్యకాలంలో నార్త్ అంటే బాలీవుడ్ సినిమాల్లో కూడా న్యూడిటీ ఎక్కువైపోతోంది. నటి రాధికా ఆప్టే, హాలీవుడ్ నటుడు దేవ్ పటేల్ కలిసి నటించిన ‘ది వెడ్డింగ్ గెస్ట్’ అనే సినిమాలో రాధిక నగ్న సన్నివేశాల్లో నటించారు. ఆమె ప్రైవేట్ పార్ట్స్ కనబడేలా సెక్స్ సీన్లు చిత్రీకరించారు. అయితే సెన్సార్ బోర్డు వాటికి అభ్యంతరం చెప్పకపోవడం ఇక్కడ షాకింగ్ విషయం. సెన్సార్ బోర్డు ని ఎలా మానేజ్ చేశారో గాని ఆ సీన్స్ అన్ని యూట్యూబ్ లో ప్రత్యక్షమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: