పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాని బాలీవుడ్ సినిమా పింక్ కి రీమేక్ గా రూపొందిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తుండగా బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే అత్తారింటికి దారేది సినిమాకి ఇప్పటికీ పవన్ క్రేజ్ ఏమాత్రం తేడా లేదని రీసెంట్ గా రిలీజ్ చేసిన వకీల్ సాబ్ పోస్టర్ తో అర్థమైంది. ఈ పోస్టర్ రిలీజ్ చేయగానే ఫ్యాన్స్ చేసిన హంగామా హడావుడి అంతా ఇంతా కాదు. రెండేళ్ళ తర్వాత వకీల్ సాబ్ వంటి రీమేక్ సినిమా చేస్తున్నా పవన్ కళ్యాణ్ క్రేజ్ క్రేజే. 

 

ఇక పవన్ కళ్యాణ్ కి యాక్షన్ సినిమాల కన్నా కామెడీ, పంచ్ డైలాగ్స్ ఉన్న సినిమాలే బాగా హిట్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ కేరెక్టర్ లో ఇన్వాల్వ్ అయ్యి కామెడీ టైమింగ్ లో రెచ్చిపోతాడు. అందుకు ఉదాహరణకు జల్సా, అత్తారింటికి దారేది సినిమాల్లో పవన్ చేసిన కామెడీనే. అయితే ఇప్పుడు చేస్తున్న వకీల్ సాబ్ లో మాత్రం చాలా సీరియస్ క్యారెక్టర్ కావడం తో సెట్ లో చాలా సైలెంట్ గా ఉన్నాడట. క్యారెక్టర్ కి సంబంధించిన మూడ్ లోనే ఉన్నాడట.

 

ఇక మరోపక్క క్రిష్ కూడా చాలా స్పీడుగా సినిమా షూటింగ్ చేస్తాడు గనక పవన్ తో ఉన్న డేట్స్ ని పర్ఫెక్ట్ గా మ్యానేజ్ చేస్తాడు. మిగతా దర్శక నిర్మాతలకే పవన్ తో ఇబ్బందులు తలెత్తే  అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసగా మేకర్స్ కి డేట్స్ ఇచ్చి ఒక సినిమా తర్వాత ఒక సినిమాని కంప్లీట్ చేసుకుంటూ వెళుతున్నారు. సినిమాకి 50 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న పవర్ స్టార్ నిర్మాతలకి ఏమాత్రం అసౌకర్యం కలగకుండా చకచకా తన పని తాను చేసుకొని వెళుతున్నారట. అయితే కొంతమంది మాత్రం ముందులా సెట్స్ లో చలాకీగా ఉత్సాహంగా కనిపించడం లేదని కామెంట్స్ చేస్తున్నారట. దాంతో వకీల్ సాబ్ సీరియస్ సాగే సినిమా. ఇలాంటి సినిమాలో ఎగరడం గెంతులేయడం ఎలా కుదురుతుందని సున్నితంగా సమాధానం ఇచ్చారట పవర్ స్టార్.  

మరింత సమాచారం తెలుసుకోండి: