మెగా మేనల్లుడు హీరో సాయిధరమ్ తేజ్‌ డైరెక్టర్ వై.వి.ఎస్ చౌదరి తెరకెక్కించిన రేయ్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. అయితే చాలా కారణాల వల్ల ఆ సినిమా రిలీజ్ కి నోచుకోలేదు. ఒక స్టార్ డైరెక్టర్ తీసిన సినిమా అందులో మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌ డెబ్యూ సినిమా ఇలా రిలీజవకుండా ఉండటం ఏంటని అందరూ షాకయ్యారు. అయినా ఈ విషయాన్ని సాయిధరమ్ తేజ్‌ మాత్రం లైట్ గా తీసుకున్నాడు. 

 

ఇక తన రెండవ సినిమా పిల్లా నువ్వు లేని జీవితం సినిమాని కమిటయ్యాడు. హిట్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా రవి కుమార్ చౌదరి చెప్పిన కథ నచ్చి ఆ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు సాయిధరమ్ తేజ్‌. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంతేకాదు సాయిధరమ్ తేజ్‌ లో మావయ్య మెగాస్టార్ పోలికలు చాలా ఉన్నాయని అందరూ అభినందించారు. డాన్స్, కామెడీ టైమింగ్, ఫైట్స్ ..ఇలా చాలా విషయా లలో చాలా ఫ్రేంస్ లో మావయ్యనే గుర్తు చేస్తున్నాడని ఖచ్చితంగా మెగాస్టార్ అంత వాడవుతాడని పిల్లా నువ్వు లేని జీవితం సినిమాతో నిరూపించుకున్నాడు. 

 

అంతేకాదు సాయిధరమ్ తేజ్‌ లో బోలెడన్ని మంచి లక్షణాలున్నాయని చాలా మంది అంటుంటారు. ఇగో లేని హీరో సాయిధరమ్ తేజ్‌ అని ఇండస్ట్రీలో పేరు సంపాదించుకున్నాడు. మెగా ఫ్యామిలీ హీరో అన్న భావనని ఎవరి దగ్గర చూపించడన్న టాక్ కూడా బాగా ఉంది. ఇక తన తోటి హీరోలతో చాలా స్నేహంగా ఉంటాడట. ఇదే కాదు ఎవరైనా ఆపదలో ఉన్నా కుడి చేతికి తెలీకుండా ఎడమ చేతితో సహాయం చేసే గుణం సాయిధరమ్ తేజ్‌ లో ఉందని ఇండస్ట్రీలో చెప్పుకోవడం విశేషం. ఇక ఫ్లాప్ డైరెకటర్స్ ని ఆదుకోవడం లో సాయిధరమ్ తేజ్‌ అందరికంటే ముందుంటాడనడానికి మారుతి, దేవా కట్టా లాంటి దర్శకులే ఉదాహరణ. ఇన్ని మంచి లక్షణాలున్నాయి కాబట్టే సాయిధరమ్ తేజ్‌ అంటే తన తోటి హీరోలు గాని, దర్శకులు గాని పడి చస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: